ఆంధ్రప్రదేశ్‌

జాతీయ మహిళా పార్లమెంటరీ సదస్సుకు పటిష్ట భద్రత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), జనవరి 31: జాతీయ మహిళా పార్లమెంటరీ సదస్సు నిర్వహణకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్టు రాష్ట్ర శాసనసభా స్పీకర్ కోడెల శివప్రసాదరావు తెలిపారు. మంగళవారం మధ్యా హ్నం దుర్గాఘాట్ కమాండ్ కంట్రోల్ రూములో రాష్ట్ర డిజిపి నండూరి సాంబశివరావు, ఎన్‌డబ్ల్యుపి చైర్‌పర్సన్ రామలక్ష్మి, జిల్లా కలెక్టర్ బాబు.ఎ, నగర పోలీస్ కమిషనర్ గౌతం సవాంగ్, ఇతర పోలీస్ ఉన్నతాధికారులతో స్పీకర్ కోడెల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్పీకర్ కోడెల మాట్లాడుతూ జాతీయ, అంతర్జాతీయ స్థాయి అత్యున్నత ప్రతినిధుల బృందంతోపాటు పెద్దఎత్తున మహిళా ప్రతినిధులు సదస్సుకు హాజరవుతారని పోలీస్ అధికారులకు తెలిపారు. ఫిబ్రవరి 10,11,12 తేదీల్లో మూడురోజులపాటు పవిత్ర సంగమం వద్ద సదస్సు జరుగుతుందన్నారు. ప్రతినిధులు బసచేసే ప్రాంతం నుండి సదస్సుకు వెళ్లే మార్గాల్లో రవాణా సౌకర్యాల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా పోలీస్ యంత్రాం గం కృషిచేయాలని స్పీకర్ సూచించారు. సదస్సుకు ప్రధానమంత్రి హాజరయ్యే పక్షంలో హెలిప్యాడ్‌లకు తగిన విధంగా ఏర్పాట్లు చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. జిల్లా యంత్రాంగం పోలీస్ అధికారుల సమన్వయంతో పనిచేసి సదస్సు విజయవంతం అయ్యే విధంగా పనిచేయాలని స్పీకర్ సూచించారు. డిజిపి సాంబశివరావు మాట్లాడుతూ సదస్సుకు హాజరయ్యే ప్రతి ఒక్కరికీ గుర్తింపు కార్డు ఇవ్వటం ద్వారా ప్రతినిధులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు. జిల్లా కలెక్టర్ బాబు.ఎ మాట్లాడుతూ సదస్సుకు హాజరయ్యే ప్రతినిధుల కోసం నగరంలోని వివిధ ప్రాంతాల్లో 200 వసతి కేంద్రాలు గుర్తించామన్నారు. వీరిని తీసుకుని వెళ్లటానికి ఉదయం అల్పాహారం అనంతరం స్కూల్ బస్సుల్లో సదస్సు జరిగే ప్రాంతానికి చేరుస్తామన్నారు. ప్రతి ఒక్కరికీ గుర్తింపు కార్డు జారీచేస్తామన్నారు. గ్లోబల్ మ్యూజిక్, డాన్స్ ఫెస్టివల్ ముగింపు తరువాత వారికి కేటాయించిన వాహనాల్లో వసతి కేంద్రాలకు తీసుకువెళతామన్నారు. పోలీస్ కమిషనర్ గౌతం సవాంగ్ మాట్లాడుతూ సదస్సు వద్ద పార్కింగ్‌కు సంబంధించి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని వివరించారు. సబ్ కలెక్టర్ సలోని సిదాన, అదనపు సిపిలు, డిసిపిలు పాల్గొన్నారు.

చిత్రం..సమీక్షలో మాట్లాడుతున్న స్పీకర్ కోడెల