ఆంధ్రప్రదేశ్‌

కాగుతున్న సీమ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, ఏప్రిల్ 9 : రాయలసీమలోభానుడి భగభగలు ఏ మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. శనివారం అనంతపురంలో సగటు ఉష్ణోగ్రత 40.3 డిగ్రీల సెల్సియస్‌గా నమోదు కాగా జిల్లా కేంద్రమైన అనంతపురంలో 40.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. బుక్కరాయసముద్రం మండలం వెంకటాపురంలో అత్యధికంగా 44.0 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. కర్నూలు జిల్లాలో సగటు ఉష్ణోగ్రత 41.1 డిగ్రీల సెల్సియస్‌గా నమోదు కాగా కర్నూలు నగరంలో 41.0 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. కడప జిల్లాలో సగటు ఉష్ణోగ్రత 41.0 డిగ్రీల సెల్సియస్‌గా నమోదు కాగా, కడప నగరంలో42.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు అయ్యింది.
వడదెబ్బకు ఇద్దరు మృతి
అనంతపురం, కర్నూలు జిల్లాల్లో శనివారం వడదెబ్బకు ఏడేళ్ల బాలుడు సహా ఇద్దరు మృతిచెందారు. అనంతపురం జిల్లా బుక్కపట్నం మండలం సుందరయ్యకాలనీకి చెందిన మహబూబ్‌బాషా (44), కర్నూలు జిల్లా బేతంచెర్ల మండలం అంబాపురంలో దివాకర్ (7) వడదెబ్బకు మృతిచెందారు.
ఉత్తరాంధ్రలో ముగ్గురు
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఏప్రిల్ 9: శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో శనివారం వడదెబ్బకు ముగ్గురు మృతి చెందారు. శ్రీకాకుళం జిల్లా గార పంచాయతీ ఆరంగిపేట గ్రామానికి చెందిన రౌతు సన్యాసిరావు(65) వడదెబ్బతో మృతి చెందాడు. అదేవిధంగా మందస మండలం బాలిగాంకు చెందిన రైతు రాజారావు(53) వడదెబ్బకు మృతి చెందాడు. విజయనగరం జిల్లా మెరకముడిదాం మండలం గర్భాంలో ముగవాపు దాలెమ్మ(70) వడదెబ్బతో మృతి చెందింది. విశాఖపట్నం జిల్లా రావికమతం మండలం పి.పొన్నవోలు పంచాయతీ కుముందానిపేటకు చెందిన కిల్లపు రాములమ్మ(68) వడదెబ్బతో మృతి చెందింది.