ఆంధ్రప్రదేశ్‌

ఇద్దరు అటవీ సిబ్బంది హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వినుకొండ/బొల్లాపల్లి, ఏప్రిల్ 9: గుంటూరు జిల్లా, బొల్లాపల్లి మండలంలోని నెహ్రూనగర్ తండా సమీపంలో ఇద్దరు ఫారెస్ట్ సిబ్బంది దారుణ హత్యకు గురయ్యారు. ఈ దారుణం శనివారం జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నల్లమల అటవీ ప్రాంతంలో పనిచేస్తున్న నాయుడుపాలెం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ డి లాజర్ (45), కండ్రిక బీట్ ఆఫీసర్ షేక్ బాజీ సాహెబ్ (49)కు నాయుడుపాలెం అటవీ ప్రాంతంలో కట్టెలు కొడుతున్నారనే సమాచారం అందింది. ఇదే సమాచారాన్ని వినుకొండ రేంజ్ ఆఫీస్‌కు ఫోన్ ద్వారా చేరవేసి కట్టెలు కొట్టే ప్రాంతానికి వెళ్లారు. అక్కడ ఆటోకు కట్టెలు లోడు చేస్తుండడం చూసి దానిని అడ్డుకున్నారు. వారి దగ్గర ఉన్న గొడ్డళ్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ సమయంలో కట్టెలు కొట్టేవారికి , ఫారెస్ట్ సిబ్బందికి మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణ తారస్థాయికి చేరి సిబ్బంది హత్యకు దారితీసి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. లాజర్‌కు కుడి వైపు డొక్కలో, తలపై గొడ్డలితో నరికిన గాయాలున్నాయి. బాజీ సాహెబ్‌ని తలపై మోది హత్య చేసినట్లు తెలుస్తోంది. కట్టెలు కొట్టేవారు పరారైనట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న ఫారెస్ట్, రెవెన్యూ, పోలీసు అధికారులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. సిసిఎఫ్ ఎకె ఫరిదా, అసిస్టెంట్ కన్జర్వేటర్ పి సునీత, డిఎస్పీ నాగేశ్వరరావు, ఆర్డీవో శ్రీనివాసరావు, పట్టణ, రూరల్ సిఐలు జి శ్రీనివాసరావు, టివి శ్రీనివాసరావు, చిలకలూరిపేట సిఐ సురేష్‌బాబు, నూజెండ్ల, బండ్లమోటు ఎస్‌ఐలు విజయ్‌చరణ్, పట్ట్భారామయ్య, పట్టణ ఎస్‌ఐ నారాయణ, తహశీల్దార్ శ్రీనివాస యాదవ్, సిబ్బంది సంఘటనా ప్రాంతానికి వెళ్లిన వారిలో ఉన్నారు. సంఘటనా ప్రాంతంలో మృతదేహాలకు శవ పంచనామా నిర్వహించి, పోస్ట్‌మార్టం నిమిత్తం వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రూరల్ ఎస్పీ నారాయణ నాయక్ ఆసుపత్రిని సందర్శించి మృత దేహాలను పరిశీలించారు. ఎస్పీ మాట్లాడుతూ ఈ హత్యలకు పాల్పడింది స్థానికులేనన్నారు. హంతకులను పట్టుకోడానికి నలుగురు ఎస్సైలతో కూడిన నాలుగు టీమ్‌లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
మృతులకు ఎక్స్‌గ్రేషియా
దారుణ హత్యకు గురైన బీట్ ఆఫీసర్ లాజరస్‌కు 25 లక్షలు, మరో అధికారి షక్ బాజీ సాహెబ్‌కు పదిలక్షలు ఎక్స్ గ్రేషియాను ప్రభుత్వం ప్రకటించింది. బాధిత కుటుంబాలకు ఇళ్లు కేటా యంచాలని నిర్ణయంచారు.