ఆంధ్రప్రదేశ్‌

మే 15న డీసెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 9: ఆంధ్రప్రదేశ్‌లో రెండేళ్ల డిప్లొమో ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్సులో అడ్మిషన్లకు మే 15వ తేదీన డీసెట్-2016ను నిర్వహించనున్నారు. అందుకు పరీక్ష ఫీజును చెల్లించేందుకు ఏప్రిల్ 20 వరకూ గడువు ఇచ్చినట్టు సెట్ చైర్‌పర్సన్ కె సంధ్యారాణి, కన్వీనర్ పి పార్వతి తెలిపారు. డీసెట్‌ఎపి డాట్ సిజిజి డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్‌సైట్‌లో అభ్యర్ధులు తమ దరఖాస్తులను పంపించుకోవచ్చని పేర్కొన్నారు. మే 1వ తేదీ నుండి హాల్‌టిక్కెట్లు జారీ చేస్తామని, మే 25న ప్రవేశపరీక్ష ఫలితాలను ప్రకటించి, తొలి దశ కౌనె్సలింగ జూన్ 3న మొదలవుతుందని, రెండో దశ కౌనె్సలింగ్ జూన్ 24న జరుగుతుందని, క్లాసులు జూన్ 15న మొదలవుతాయని వివరించారు.

బాధిత డిపాజిటర్ల కోసం వెబ్‌సైట్
మోసపూరిత సంస్థలపై 180 కేసులు
సిఐడి చీఫ్ తిరుమల రావు వెల్లడి
హైదరాబాద్, ఏప్రిల్ 9: ప్రజల నుంచి డిపాజిట్లు వసూలు చేసి మోసం చేసిన 23 సంస్థలకు సంబంధించి పూర్తి వివరాలను వెబ్‌సైట్‌లో ఉంచినట్లు ఆంధ్ర సిఐడి చీఫ్ ద్వారకా తిరుమలరావు ప్రకటించారు. ఈ సంస్థల బాధితులు తమవివరాలను ఈ వెబ్‌సైట్‌లోకి వెళ్లి నమోదు చేసుకోవచ్చని, దీని వల్ల కేసుల దర్యాప్తు సులువవుతుందన్నారు. గత ఐదేళ్లుగా ఈ సంస్థలు ప్రజలనుమోసం చేస్తున్నట్లు ఫిర్యాదులు అందితే కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. మొత్తం 23 సంస్ధలపై 180 కేసులు నమోదు చేశామన్నారు. ఈ వెబ్‌సైట్‌కు ‘ప్రొటెక్షన్ ఆఫ్ ఏపి డిపాజిటర్స్. కామ్’ అని నామకరణం చేశారు. ఈ వెబ్‌సైట్‌ను ఏపి డిజిపి జెవి రాముడు ప్రారంభించారు. చట్ట ప్రకారం ఈ సంస్థల నుంచి డిపాజిట్లు రాబట్టుకున్న తర్వాత నిర్దేశించిన నిబంధనల మేరకు ప్రజలకు డిపాజిట్లను చెల్లించడం వీలవుతుందన్నారు. డిపాజిటర్లు వెబ్‌సైట్‌లోకి వెళ్లి తమ వద్ద రసీదు, ఇతర వివరాలను స్కాన్ చేసి అప్‌లోడ్‌చేయాల్సి ఉంటుందన్నారు. ఇంటి వివరాలను పొందుపరచాలన్నారు. ‘సిఐడిఏపి.గవ్.ఇన్’లోకి వెళితే లింక్ ఇచ్చామన్నారు. అనేక మోసపు కంపెనీల ఆస్తులను అటాచ్ చేశామన్నారు.