ఆంధ్రప్రదేశ్‌

మావోయిస్టు నేత రవి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చింతపల్లి, ఏప్రిల్ 9: మావోయిస్టు నేత కుడుమల రవి(38) శనివారం అనారోగ్యంతో మృతి చెందాడు. విశాఖ జిల్లా జికె.వీధి మండలం సప్పర్ల ప్రాథమిక ఆసుపత్రి సమీపంలో రవి అపస్మారక స్థితిలో పడి ఉండగా చూసిన స్థానికులు ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడి వైద్యసిబ్బంది ప్రథమ చికిత్స అందించారు. సమాచారం తెలుసుకున్న రవి కుటుంబీకుల్లో ఒకరు ఆసుపత్రికి చేరుకుని మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నం తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. దీంతో రవి మృతదేహాన్ని స్వగ్రామం కొమ్మంగికి తరలించారు. ఆదివారం ఉదయం రవి అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబసభ్యులు తెలిపారు.చింతపల్లి మండలం కొమ్మంగి గ్రామానికి చెందిన కుడుమల రవి 1997లో కొయ్యూరు ఎపిఆర్‌జెసిలో చదువుతుండగా మావోయిస్టు ఉద్యమం పట్ల ఆకర్షితుడై రాడికల్ విద్యార్థి సంఘంలో చేరాడు. 1998లో చింతపల్లి మండలం కొమ్మంగిలో మావోయిస్టులు, పోలీసులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో రవి తప్పించుకున్నారు. మొదట దళసభ్యుడిగా ప్రస్థానం ప్రారంభించిన రవి డిప్యూటీ కమాండర్, కమాండర్ స్థాయికి ఎదిగాడు. ప్రస్తుతం ఆంధ్రా - ఒడిశా సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టుల కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు.

చత్తీస్‌గఢ్‌లో122 మంది మావోల లొంగుబాటు
చింతూరు, ఏప్రిల్ 9: ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రం సుకుమా జిల్లాలో కలెక్టరు, పోలీస్ ఉన్నతాధికారుల సమక్షంలో 122 మంది మావోయిస్టులు శనివారం లొంగిపోయారు. 11 మంది మహిళా మావోయిస్టులతో సహా 122 మంది మావోయిస్టులు లొంగిపోయినట్టు బస్తర్ ఐజి ఎఫ్‌ఆర్‌పి కల్లూరి తెలిపారు. జిల్లా ఎస్పీ నీరజ్ బన్‌సోడ్, ఎస్పీ డి సర్వన్ సమక్షంలో వీరు లొంగిపోయారు. బస్తర్ రీజియన్‌లో ఇంతమంది మావోయిస్టులు లొంగిపోవడం ఇదే ప్రథమమని పోలీసులు చెబుతున్నారు. ప్రజలకు పోలీసులు చేస్తున్న కార్యక్రమాలకు ఆకర్షితులై మావోయిస్టులు లొంగిపోయినట్టు చెబుతున్నారు.

నక్సల్ ప్రభావిత ప్రాంతాలపై పోలీసుల ఆరా

కడప, ఏప్రిల్ 9: ఒకప్పుడు మావోయిస్టు ప్రభావిత ప్రాంతంగా ఉన్న కడప జిల్లాలోని శేషాచలం, నల్లమల అటవీ ప్రాంతాలపై పోలీసులు తిరిగి దృష్టి సారించారు. నవ్యాంధ్ర నూతన రాజధానిలో మహిళా మావోయిస్టు నేత అన్నపూర్ణ అలియాస్ అరుణక్క ఇటీవల పట్టుబడిన నేపథ్యంలో జిల్లాలో కూడా పోలీసులు అప్రమత్తమై మావోఅమర్‌నాథ్ యాత్రికులకు కొత్త కష్టాలుయిస్టు ప్రభావిత ప్రాంతాలపై ఆరా తీస్తున్నారు. జిల్లాలో మావోయిస్టు కార్యకలాపాలు వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పూర్తిగా తగ్గుముఖం పట్టాయి. రాయచోటి, సుండుపల్లి, చిన్నమండెం, గాలివీడు, సంబేపల్లి, రామాపురం, చక్రాయపేట మండలాల్లో బహుద, పెన్నా, మాండవ్య, పాపాగ్ని నదులు ఉండటంతో ఆ పరివాహక ప్రాంతాలు, బద్వేలు నియోజకవర్గంలోని కాశినాయన, బి.కోడూరు, గోపవరం, అట్లూరు, కలసపాడు నలమల అభయారణ్యాల్లో మావోల కదలికలు ఉండేవి. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో కడప, చిత్తూరు, కర్నూలు ప్రాంతాల్లో ఇసుక, రియల్, ఎర్రచందనం మాఫియాలు రంగ ప్రవేశం చేసి దోచుకుంటున్న తరుణంలో ఇతర రాష్ట్రాల నుంచి మావోయిస్టులు మళ్లీ తెలుగు రాష్ట్రంలో కార్యకలాపాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. గతంలో రాయచోటి, లక్కిరెడ్డిపల్లె, రాజంపేట పరిసర ప్రాంతాలకు చెందిన వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు గ్రామాలు వదిలి కర్నాటక, తెలంగాణ రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు వెళ్లి స్థిరనివాసం ఏర్పరచుకున్నారు. వారిలో కొంతమంది వైఎస్ హయాంలో తిరిగి తమ గ్రామాల్లో ప్రవేశించారు. ఇటీవల రాజధాని ప్రాంతంలో అరుణక్కను పోలీసులు అరెస్టు చేయడంతో కడప జిల్లాలో కూడా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ముఖ్యంగా కేంద్ర, రాష్ట్ర కీలక నేతలు కృష్ణప్ప, ఆర్కె, సూర్యం, భారతక్క, కాలంగి, బహుద, పాపాగ్ని, కోనంగి దళాల కమాండర్లంతా ఈ ప్రాంతానికి చెందిన వారే. అరుణక్కను పోలీసులు అరెస్టు చేయడంతో పోలీసులు నిఘా పెట్టి మూడు జిల్లాల సరిహద్దుల్లో మావోయిస్టుల కదలికలపై ఆరా తీస్తున్నట్లు తెలిసింది.