కృష్ణ

మీ కోసం అర్జీలు సత్వరమే పరిష్కరించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: ప్రతి సోమవారం నిర్వహించే మీకోసం (ప్రజావాణి) కార్యక్రమంలో భాగంగా సబ్‌కలెక్టర్ జి.సృజన ఆమె కార్యాలయ సమావేశమందిరంలో ప్రజల నుండి పలు అర్జీలను స్వీకరించారు. స్వీకరించిన అర్జీలకు రశీదులను అప్పటికప్పుడే అందజేశారు. వివిధ శాఖలకు సంబంధింన మొత్తం 15కు పైగా అర్జీలను ప్రజల నుండి సబ్ కలెక్టర్ స్వీకరించారు. అర్జీలలో అత్యధికంగా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్‌కు గృహాలు మంజూరు చేయాలని 5 అర్జీలు రాగా, రెవెన్యూ శాఖకు 6, సాంఘిక సంక్షేమశాఖ, జిల్లా గ్రామీణాభివృద్ధి, మండల పరిషత్, విద్యాశాఖలకు ఒక్కొక్క అర్జీని స్వీకరించారు. అర్జీలను అప్పటికప్పుడు ఆన్‌లైన్ ద్వారా నమోదు చేస్తున్నామన్నారు. సంబంధిత శాఖల అధికారులు వాటి పరిష్కారానికి త్వరితగతిన చర్యలు చేపట్టాలని సబ్‌కలెక్టర్ డా. జి.సృజన అధికారులను ఆదేశించారు.

మేరీమాత ఉత్సవాలకు బందోబస్తుపై సిపి సురేంద్రబాబు స్వీయ పర్యవేక్షణ
విజయవాడ (క్రైం), ఫిబ్రవరి 8: ప్రతిష్ఠాత్మకంగా ఈ నెల 9 నుంచి ప్రారం భం కానున్న గుణదల మేరీమాత ఉత్సవాల బందోబస్తు ఏర్పాట్లను ఇన్‌చార్జ్ పోలీసు కమిషనర్ ఎన్‌వి సురేంద్రబాబు సోమవారం స్వయంగా పర్యవేక్షించారు. మూడురోజులు జరిగే ఉ త్సవాలకు రాష్ట్రం నలుమూలల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు తరలిరానున్నా రు. భక్తులతో పాటు నగర ప్రజలకు, వాహన చోదకులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఇప్పటికే నగర పోలీసు శాఖ ముందస్తు భద్రతా చర్య లు తీసుకుంది. మరోవైపు నగరంలో ట్రాఫిక్ మళ్లింపు, ప్రత్యేక పార్కింగ్ ప్రదేశాల ఏర్పాట్లు కూడా చేశారు. ఇక ప్రధానంగా తరలివచ్చే భక్తుల భద్రతకు సంబంధించి సిపి సురేంద్రబాబు పర్యవేక్షణలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. గుడి వద్దకు సోమవారం వచ్చిన సురేంద్రబాబు కొండపైకి ఎక్కి అక్కడి పరిస్థితులపై ఆరాతీశారు. ఏర్పాట్లు పరిశీలించారు. ఇదే స మయంలో బందోబస్తు చర్యలపై అధికారులకు సూచనలు చేశారు. ఇద్దరు డిఎస్పీలు, 12మంది సిఐలు, 30మంది ఎస్‌ఐలు, 50మంది హెడ్ కానిస్టేబుళ్లు, 300 మంది కానిస్టేబుళ్లు, 100 మంది హోంగార్డులు, 30మంది మహిళా పోలీసు కానిస్టేబుళ్లు బందోబస్తు విధుల్లో పాల్గొంటున్నారు. ఇదే సమయంలో భక్తుల రద్దీ దృష్ట్యా ఇదే అదనుగా తీసుకుని నేరగాళ్లు రెచ్చిపోయే అవకాశం ఉన్నందున సిసిఎస్ సిబ్బం ది ప్రత్యేకంగా మోహరిస్తున్నారు. అనుమానిత వ్యక్తులు, అనుమానం కలిగిం చే వస్తువులు, తదితర వాటిపై ఎప్పటికప్పుడు ప్రత్యేక నిఘా ఉండేలా ఆదేశించారు. మరోవైపు గుడి వద్ద నుంచి కొండపై వరకు అణువణువు తనిఖీలు నిర్వహించారు. సిసి కెమెరాలు ఏర్పా టు చేయడం ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితిని సిబ్బంది పర్యవేక్షిస్తున్నారు. పోలీసు జాగిలాలు, బాంబు స్క్వాడ్ బృందాలను అందుబాటులో ఉంచా రు. ప్రత్యేక బలగాలు బందోబస్తు విధుల్లో పాల్గొంటున్నాయి. మొత్తం భద్రత, బందోబస్తుకు సంబంధించి సురేంద్రబాబు తనదైన శైలిలో అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశారు.

కలుషిత ఆహారం తిని విద్యార్థులకు అస్వస్థత
విజయవాడ (కార్పొరేషన్), ఫిబ్రవరి 8: నగర పాలక సంస్థ పాఠశాలల్లో అధికారుల పర్యవేక్షణ అత్యంత లోపభూయిష్టంగా మారడంతో మధ్యాహ్న భోజన పథకాన్ని నిర్వహించే ఏజెన్సీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. ఏజెన్సీలతో కుమ్మక్కైన పాఠశాల ప్రధానోపాధ్యాయుల తీరు కూడా మధ్యాహ్న భోజనంతో కడుపులు నింపుకునే చిన్నారులకు శాపంగా మారింది. సోమవారం ఉదయం మొగల్‌రాజపురంలోని బోయపాటి శివరామకృష్ణ విఎంసి పాఠశాలలో జరిగిన కలుషిత ఆహార పంపిణీయే ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. భోజనం తయారీలో అనుసరించాల్సిన నిబంధనలు ఉల్లంఘించి అత్యంత దుర్భర ప్రదేశాల్లో వండి వడ్డించటంతో పలువురు విద్యార్థులు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. అదృష్టవశాత్తూ వారు ప్రాణాపాయ పరిస్థితుల నుంచి బయటపడ్డారు. భోజనంలో నాసిరకం, కల్తీ పదార్థాలను వినియోగించడం వల్లనే విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారనే విషయం ప్రాథమిక విచారణ తేలింది. పూర్వాపరాలను విచారించిన అనంతరం విఎంసి చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ గోపీనాయక్ విద్యాధికారుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఆయన హుటాహుటిన పాఠశాలకు చేరుకొని విద్యార్థులకు వైద్య సదుపాయాలను అందుబాటులోకి తెచ్చారు. అలాగే విద్యార్థుల ఆరోగ్యం మెరుగుదల, పర్యవేక్షణ కోసం మరో రెండు రోజులు పాఠశాలల్లో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి వైద్యసేవలను అందుబాటులో ఉంచారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న విఎంసి కమిషనర్ వీరపాండియన్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎస్‌ఎల్ నరశింహరావును సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.