ఆంధ్రప్రదేశ్‌

సిబిఐ జెడిగా నాగేశ్వరరావు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 9: ఒడిశా కేడర్ 1986వ, బ్యాచ్‌కు చెందిన ఐపిఎస్ అధికారి ఎం నాగేశ్వర రావు నూతన సిబిఐ జాయింట్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. వరంగల్ జిల్లా మంగపేటకు చెందిన నాగేశ్వర రావు సుదీర్ఘకాలంగా భువనేశ్వర్ డెవలప్‌మెంట్ అథారిటీ ఉన్నతాధికారిగా పనిచేశారు. ప్రస్తుతం ఒడిశా కేడర్‌లో అదనపు డైరెక్టర్ జనరల్‌గా పనిచేస్తున్న ఆయన హైదరాబాద్ సిబిఐ జెడిగా పదోన్నతి పొందారు. సిఆర్‌పిఎఫ్ ఐజిగా పనిచేసిన ఆయన 2008లో కర్ణాటకలో జరిగిన అల్లర్లలో కీలక పాత్ర పోషించి శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జెడి లక్ష్మినారాయణ హయాంలో సిబిఐ దర్యాప్తు సంస్థ ప్రాధాన్యత సంతరించుకుందన్నారు. సిబిఐ కేసుల దర్యాప్తులో ముందుంటుందని, నిందితులను ఉపేక్షించబోదని నాగేశ్వరరావు స్పష్టం చేశారు.

పోలీసుల అదుపులో మహిళా నక్సల్
గూడెంకొత్తవీధి, ఏప్రిల్ 9: విశాఖ ఏజన్సీ గూడెంకొత్తవీధి మండలం పోలీసులు శుక్రవారం రాత్రి ఒక మహిళా మావోయిస్టును అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. గత పదేళ్ళుగా గాలికొండ ఏరియా కమిటీలో దళ సభ్యురాలిగా పనిచేస్తున్న వసంత అలియాస్ చెచ్చును పోలీసులు అరెస్టుచేసినట్లు సమాచారం గూడెంకొత్తవీధి మండలం బోనంగపల్లి గ్రామానికి చెందిన వసంత పదేళ్ళుగా మావోయిస్టు పార్టీలో కీలక సభ్యురాలిగా పని చేస్తోంది. మావోయిస్టు నేత కృష్ణను వివాహం చేసుకుంది. ఇటీవల అనారోగ్యంతో బాధపడుతున్న ఈమె రహస్యంగా చికిత్స నిమిత్తం స్వగ్రామం బోనంగిపల్లికి వచ్చింది. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు వసంతను శుక్రవారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.