ఆంధ్రప్రదేశ్‌

ఇక ‘జోన్’ జగడం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఫిబ్రవరి 6: ప్రత్యేక హోదా అంశంలో తెలుగుదేశం సర్కారును దోషిగా నిలబెట్టేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోన్న వైసీపీ, తాజాగా ఉత్తరాంధ్ర ప్రజలకు చేరువయ్యే లక్ష్యంలో భాగంగా విశాఖ రైల్వే జోన్ ఉద్యమానికి తెరలేపనుంది. రైల్వే జోన్ అంశంతో రాజకీయంగా వెనుకబడిన ఉత్తరాంధ్రలో పైచేయి సాధించే ఎత్తుగడతో వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ఆధ్వర్యాన పాదయాత్ర నిర్వహించాలని తీసుకున్న నిర్ణయం తెలుగుదేశం, బిజెపిలకూ సంకటంలా మారింది. త్వరలో ప్రతిష్ఠాత్మకమైన గ్రేటర్ విశాఖ కార్పొరేషన్‌కు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వైసీపీ వ్యూహాత్మకంగా విశాఖ రైల్వే జోన్ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి తెలుగుదేశం-బిజెపిలను రాజకీయంగా దెబ్బతీసేందుకు పాదయాత్ర నిర్వహించాలని నిర్ణయించింది. రైల్వే జోన్ ఇవ్వడంలో టిడిపి-బిజెపి విఫలమయ్యాయనే నినాదంతో అనకాపల్లి నుంచి భీమిలి వరకూ తొలిదశలో పాదయాత్ర నిర్వహించాలని వైసీపీ నాయకత్వం తీర్మానించింది. ఇందులో సీనియర్ నేత బొత్స కీలకపాత్ర పోషిస్తున్నారు. ఆయన ఆధ్వర్యంలోనే పాదయాత్రకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ పాదయాత్రకు స్వయంగా పార్టీ అధినేత జగన్ కూడా హాజరుకానున్నందున, రైల్వే జోన్ అంశం మరోసారి రాజకీయంగా చర్చకు రానుంది. రైల్వే శాఖ మంత్రి సురేష్‌ప్రభుకు ఏరికోరి ఏపి నుంచి రాజ్యసభ సీటు ఇచ్చినా ఎన్డీఏపై ఒత్తిడి తెచ్చి జోన్ తీసుకురావడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విఫలమయ్యారని, హోదాను తాకట్టు పెట్టిన బాబు, అదే వరసలో జోన్‌నూ కేంద్రం వద్ద తాకట్టుపెట్టారన్న విమర్శలతో వైసీపీ జనంలోకి వెళ్లనుంది. వైసీపీ గౌరవాధ్యక్షురాలు విజయలక్ష్మి ఓటమి తర్వాత విశాఖలో డీలాపడిన పార్టీలో గత కొద్దినెలల నుంచి జగన్ తన పర్యటనలతో చైతన్యం తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు.
తాజాగా హోదా ఉద్యమం కోసం విశాఖ ఎయిర్‌పోర్టుకు వచ్చిన వైనంతో జగన్‌కు పొలిటికల్ మైలేజీ, ఆయనను రానీయకుండా అడ్డుకున్నారన్న సానుభూతి పార్టీ దక్కించుకుంది. ఈ క్రమంలో రైల్వే జోన్ అంశాన్ని తెరమీదకు తీసుకొచ్చి, దాన్నొక సెంటిమెంట్‌గా మళ్లీ రగిలించాలని వైసీపీ నిర్ణయించింది. ఉత్తరాంధ్రలో నలుగురు ఎంపీలు, నలుగురు మంత్రులున్నా సొంత ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురాలేని వారు తమ పదవులకు రాజీనామా చేయాలన్న డిమాండుకు పదునెక్కించనుంది. ప్రధానంగా సీఎం బాబు, మంత్రి గంటా, ఎంపి హరిబాబు, అవంతి శ్రీనివాస్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శనాస్త్రాలు సంధించాలని నిర్ణయించింది. ఈ పాదయాత్రలో జగన్ స్వయంగా పాల్గొననుండటం వల్ల జోన్ అంశానికి ప్రాధాన్యం పెరుగుతుందని, దాన్ని సెంటిమెంట్ సమస్యగా మలిచి, ఉత్తరాంధ్ర అంతటా ఉద్యమాలు నిర్వహించడం ద్వారా తెలుగుదేశం పార్టీని దెబ్బతీయాలన్న వ్యూహానికి వైసీపీ పదునుపెడుతున్నట్లు కనిపిస్తోంది. ఇది త్వరలో జరగనున్న విశాఖ కార్పొరేషన్ ఎన్నికల్లో వజ్రాయుధంలా పనిచేస్తుందని, జోన్‌పై తమ పోరాటాలకు స్పందించి నిర్దిష్ట హామీ ఇచ్చే సాహసం టిడిపి-బిజెపి చేయనందున, రాజకీయంగా ఆ రెండు పార్టీలు దెబ్బతింటాయని వైసీపీ అంచనా వేస్తోంది. గతంలో ఇదే అంశంపై నాలుగురోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసిన వైసీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ వ్యవహారం రాష్టవ్య్రాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించింది.