ఆంధ్రప్రదేశ్‌

రసాభాసగా అభిప్రాయసేకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, ఫిబ్రవరి 6:అరుపులు, కేకలు, ఆందోళన మధ్య బిసి కమిషన్ చైర్మన్ జస్టిస్ కెఎల్ మంజునాథ్ బహిరంగ విచారణ సభ అర్ధాంతరంగా వాయిదాపడింది. సోమవారం ఉదయం 10.30గంటలనుండి సాయంత్రం ఐదుగంటల వరకు ఒంగోలులోని ఎ-1 కన్వన్షన్‌హాలులో కాపులను బిసిల్లో చేర్చే విషయంపై బహిరంగ విచారణ జరిగింది. ఈసందర్భంగా ఉదయం 10.30గంటలనుండి మధ్యాహ్నం 1.30గంటల వరకు సభాసజావుగా జరిగినప్పటికీ అనంతరం 2.45గంటలకు ప్రారంభమైన సభ రసాభాసగా మారింది. సాయంత్రం 3.45గంటల వరకు గంటపాటు సభా ఆందోళనలతో అట్టుడుకింది. తొలుత కాపులకు మాట్లాడే అవకాశం ఇవ్వడంతో సభలో పెద్దఎత్తున బిసి సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు. ముందుగా తామే మాట్లాడాలంటూ భీష్మించి కూర్చోవటంతో గంటపాటు సభలో అరుపులు, కేకలు, ఆందోళన మధ్య సాగింది. ఈసమయంలో సభాప్రాంగణంలో ఉన్న కుర్చీలను బిసి సంఘాల నాయకులు చిందరవందరగా విసిరివేశారు. ఒకదశలో బిసి సంఘాల నాయకులు కమిషన్ చైర్మన్, సభ్యులు వారించినప్పటికీ వారు వినకపోవటంతో సాయంత్రం 4.16గంటలకు సభను వాయిదావేస్తూ కమిషన్, సభ్యులు బయటకు వెళ్ళిపోయేందుకు లేవటంతో బిసి సంఘాల నాయకులు ఒక్కసారిగా డయాస్ వద్దకు చేరుకుని సభ్యులు వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. ఐదు నిమిషాల అనంతరం 4.23గంటలకు తిరిగి విచారణ ప్రారంభమైంది. మరో నిమిషాల ఆందోళన అనంతరం కమిషన్ చైర్మన్ కాపులకు మాట్లాడే అవకాశం ఇవ్వటంతో ముగ్గురు సభ్యులు మాట్లాడిన తరువాత బిసి సంఘాల నాయకులు తిరిగి ఆందోళనకు దిగారు. ఇప్పటికే కాపులకు గంటకు పైగా మాట్లాడే అవకాశం ఇచ్చారని తమకు కూడా త్వరగా అవకాశం ఇవ్వాలని నినాదాలు చేశారు. ఈదశలో కమిషన్ చైర్మన్ మంజునాధ్ కలుగచేసుకుని సాయంత్రం ఐదుగంటల సమయానికి విచారణ సభ ముగియాల్సి ఉన్నప్పటికి బిసి సంఘాల నాయకులు ఎంతమంది మాట్లాడినా, ఎంత సమయం అయినప్పటికీ తాను వేచి ఉంటానని స్పష్టంగా చెప్పినా ఫలితం దక్కలేదు. ఈదశలో తిరిగి కమిషన్, సభ్యులకు వ్యతిరేకంగా బిసి సంఘాల నాయకులు నినాదాలు చేయటంతో విధిలేని పరిస్థితుల్లో సాయంత్రం 4.32గంటలకు విచారణ సభను అర్ధాంతరంగా వాయిదా వేసి వెళ్ళిపోయారు. వెంటనే బిసి సంఘాల నాయకులు భారీ ఎత్తున చేరుకుని మంగమ్మకాలేజి నాలుగుకూడళ్ళ జంక్షన్‌లో రాస్తారాకో నిర్వహించారు. పోలీసులు రంగప్రవేశం చేసి బిసి సంఘాల నాయకులతో మాట్లాడి నప్పటికి ఆందోళన కార్యక్రమాన్ని విరమించలేదు. ఈదశలో గుంటూరు జిల్లా నాదెండ్లకు చెందిన ఆళ్ళ శివగోపి యాదవ్ వంటిపై పెట్రోలు పోసుకుని నిప్పు అంటించుకోవటంతో ఒక్కసారిగా ఆందోళన ఉద్ధృతమైంది. వెంటనే పోలీసులు, బిసి సంఘాల నాయకులు అప్రమత్తమై ఆ యువకుడిని కాపాడారు. కాగా బిసి సంఘాల నాయకులు ఆర్ వెంకట్రావు, డి మస్తాన్‌రావు, రామస్వామి, టి ఆంజనేయులు, బి శివ నేతృత్వంలో ఆందోళనకారులు మంజునాథ కమిషన్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు.