ఆంధ్రప్రదేశ్‌

రాష్ట్రంలో రూ.5 వేల కోట్ల పెట్టుబడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 9: రాష్ట్రంలో వివిధ రంగాల్లో 5 వేల కోట్ల రూపాయల మేర పెట్టుబడులు పెట్టేందుకు ఇండియన్ బ్యాంక్ ముందుకు వచ్చింది. వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఆ బ్యాంక్ ఎండి మహేష్ కుమార్ జైన్ గురువారం కలిశారు. వౌలిక సదుపాయాలు, విద్య, పర్యాటకం, ఆతిథ్య రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమని తెలిపారు. బ్యాంక్ ప్రతిపాదనలను సిఎం స్వాగతించారు.
రాజధాని అమరావతిలో బ్యాంక్ జోనల్ కార్యాలయం ఏర్పాటు చేయాలని సిఎం విజ్ఞప్తి చేశారు. దీనిపై బ్యాంక్ ఎండి సానుకూలంగా స్పందించారు. కాపు కార్పొరేషన్, బ్రాహ్మణ కార్పొరేషన్, ఎస్సీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్ల రుణాలు తమ బ్యాంక్ ద్వారా అందచేస్తున్నామని, తాము ఇస్తున్న రుణాల్లో సగం వ్యవసాయ రుణాలేనని సిఎంకు తెలిపారు. కృష్ణా జిల్లాల్లో 100 మంది బ్యాంకింగ్ కరెస్పాండెంట్లు ఉన్నారని వివరించారు.

చిత్రం..బాబుతో సమావేశమైన ఇండియన్ బ్యాంకు ఎండి మహేష్‌కుమార్ జైన్, అధికారులు