ఆంధ్రప్రదేశ్‌

రాకెట్ ప్రయోగానికి సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట, ఫిబ్రవరి 11: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ థావన్ స్పేస్ సెంటర్ (షార్) కేంద్రం నుండి ఈ నెల 15న పిఎస్‌ఎల్‌వి-సి 37 రాకెట్ ప్రయోగం చేపట్టనుంది. ఈ రాకెట్ ద్వారా మన దేశానికి చెందిన ఉపగ్రహాలతో పాటు విదేశాలకు చెందిన మొత్తం 104 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపనున్నారు. ఇప్పటికే రాకెట్ నాలుగు దశలు, ఉపగ్రహాల అనుసంధాన పనులను శాస్తవ్రేత్తలు శరవేగంగా పూర్తిచేశారు. శనివారం ఉపగ్రహాల చుట్టు ఉష్టకవచాన్ని అమర్చే ప్రక్రియను సైతం శాస్తవ్రేత్తలు విజయవంతంగా పూర్తిచేశారు. ఆదివారం షార్‌లో డాక్టర్ సురేష్ అధ్యక్షతన ప్రయోగానికి సంబంధించిన చివరి మిషన్ రెడీనెష్ రివ్యూ సమావేశం (ఎంఆర్‌ఆర్) జరగనుంది. శాస్తవ్రేత్తలు అందరూ పాల్గొని ప్రయోగం సుదీర్ఘంగా చర్చించనున్నారు. ఎంఆర్‌ఆర్ అనంతరం షార్ డైరెక్టర్ పి.కున్హికృష్ణన్ అధ్యక్షతన లాంచింగ్ ఆథరైజేషన్ బోర్డు (ఎల్‌ఎబి) సమావేశమై ప్రయోగానికి సంసిద్ధత తెలపనున్నారు. ఈ రాకెట్ మన దేశానికి చెందిన 730కిలోల బరవుగల ప్రధాన ఉపగ్రహం కార్టోశాట్-2డి, ఇస్రో రూపొందించిన మరో రెండు ఐఎన్‌ఎస్-1ఎ, ఐఎన్‌ఎస్-1బి నానో ఉపగ్రహాలు, అమెరికాకకు చెందిన (యుఎస్‌ఎ) 96నానో ఉపగ్రహాలతో పాటు ఇజ్రాయిల్,ఖజికిస్తాన్, నెదర్లాండ్, స్విట్జర్లాండ్, యుఎఇ దేశాలకు చెందిన ఒక్కొక్క ఉపగ్రహాలను మొత్తం 104 ఒకేసారి కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. అన్నీ అనుకూలిస్తే ఈ నెల 15న ఉదయం 9:28గంటలకు షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుండి రాకెట్ ప్రయోగం జరుగుతుంది.