ఆంధ్రప్రదేశ్‌

కడివెడు పాలలో చుక్క విషం చల్లే యత్నం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 12: కడివెడు పాలలో చుక్క విషం చల్లే ప్రయత్నం జరిగింది.. అయినా.. ఆశించిన దానికంటే మహిళా సదస్సు ఎంతో విజయవంతంగా.. భావితరాలకు స్ఫూర్తిదాయకంగా జరిగిందంటూ శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు అన్నారు. సదస్సు ప్రాంగణంలో ఆదివారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన తాజాగా జరిగిన వైకాపా శాసనసభ్యురాలు రోజా ఘటనను పురస్కరించుకుని ఎంతో ఆవేదనతో పై విధంగా వ్యాఖ్యానించారు. మహిళలు ముఖ్యంగా ఆడపిల్లలు ఉన్నతస్థాయికి ఎదగాలన్న ఆకాంక్ష.. అందకు తగిన ప్రోత్సాహం తన నుంచి మొదటి నుంచి కూడా ఉంటూ వచ్చింది.. వారి పట్ల గతంలోనూ అలాగే నేడు కూడా మరొక అభిప్రాయం లేదన్నారు. ఈ సదస్సు నిర్వహణ ఏర్పాట్లు ఆరంభం నుంచి కూడా కొందరు ఉద్దేశపూర్వకంగా తనపై అసత్య ప్రచారం చేస్తూ వచ్చారంటూ.. అలాంటి భావన ఏనాడు తన నోటి వెంట, చేతుల వెంట లేదన్నారు. పిల్లల ఆశయాలకు అనుగుణంగా వారు కోరుకున్న రంగంలో రాణించేందుకు తల్లిదండ్రులు పూర్తి సహాయ సహకారాలు అందివ్వాలని స్పీకర్ కోడెల శివప్రసాదరావు కోరారు. జనాభాలో సగభాగమైన మహిళల సమస్యలపై చర్చించేందుకు ఈ జాతీయ మహిళా పార్లమెంటు సదస్సు నిర్వహణకు గత నాలుగు నెలలుగా అవిశ్రాంతంగా కృషిచేశామన్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుండే కాకుండా బంగ్లాదేశ్, శ్రీలంక, అమెరికా వంటి పలు దేశాల నుండి కూడా విద్యార్థులు, ప్రతినిధులు రావడం విశేషమన్నారు. వివిధ రంగాల్లో అత్యున్నత స్థానాల్లో గల మహిళలు వారు ఆ స్థాయికి చేరుకోవడానికి ఎదుర్కొన్న సమస్యలను, అనుభవాలను ఈ వేదికపై పంచుకోవడం జరిగిందని అన్నారు. గత రెండు రోజులుగా రాజకీయ, విద్య, వ్యాపార, పాలన వ్యవహారాలు ఇతర విభాగాల్లో రాణించిన మహిళలు చెప్పిన సూచనలను స్వీకరిస్తామన్నారురు. ఈ కార్యక్రమాన్ని జాతీయ స్థాయిలో ప్రసార మాధ్యమాలు బాగా కవరేజ్ చేశాయన్నారు. తాను మహిళలకు, వారి ఆకాంక్షలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని, తల్లిదండ్రులు కూడా అమ్మాయిలు ఏ రంగంలో రాణించగలరో ఆ రంగంలో వారు లక్ష్యాన్ని చేరుకొనేందుకు పూర్తి సహాయ సహకారాలు అందివ్వాలనే సంకల్పంతో ఈ వేదిక మహిళా సాధికారత సాధనకు చిరుప్రయత్నం చేశామన్నారు.

చిత్రం..విలేఖరులతో మాట్లాడుతున్న కోడెల