కృష్ణ

ప్రజా పంపిణీలో జిల్లా సరికొత్త రికార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: ప్రజా పంపిణీ వ్యవస్థలో జిల్లా కలెక్టర్ బాబు.ఎ సరికొత్త రికార్డును నెలకొల్పారు. కేవలం ఎనిమిది రోజుల్లో 80 శాతం కార్డుదారులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయించి రాష్ట్రంలోనే జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపారు. ప్రజా పంపిణీ వ్యవస్థలో ఆయన తీసుకువస్తున్న మార్పులు సత్ఫలితాలను ఇస్తున్నాయి. సరుకుల పంపిణీలో పారదర్శకత ఉండాలని గత ఏడాది ఏప్రిల్‌లో ఈ-పోస్ విధానాన్ని జిల్లాలో ప్రయోగాత్మకంగా ప్రవేశ పెట్టిన కలెక్టర్ ప్రధాని నరేంద్ర మోడీ దృష్టిని సైతం ఆకర్షించి పలు అవార్డులు అందుకున్నారు. ప్రస్తుతం అతి తక్కువ సమయంలో రేషన్ పంపిణీ చేయాలన్న కలెక్టర్ లక్ష్యం నెరవేరింది. ఫిబ్రవరి నెలకు సంబంధించిన రేషన్ సరుకులను 10వతేదీ లోపు పంపిణీ చేయాలని జనవరి మాసాంతంలో అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దీంతో రెవెన్యూ, పౌర సరఫరాల అధికారులు సమిష్టిగా కృషి చేశారు. జనవరి నెలాఖరు నాటికే ఎంఎల్‌ఎస్ పాయింట్ల నుండి సరుకును రేషన్ షాపులకు పంపించేశారు. ప్రతి రోజూ రేషన్ సరుకుల పంపిణీని పర్యవేక్షించారు. సోమవారం సాయంత్రానికి జిల్లాలో 80శాతం రేషన్ సరుకుల పంపిణీ పూర్తయింది.
91.54శాతం రేషన్ పంపిణీతో బంటుమిల్లి మండలం జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచింది. మైలవరం, పమిడిముక్కల, కంకిపాడు, ముదినేపల్లి, వీరుళ్ళపాడు, నాగాయలంక, గన్నవరం, పెడన, కంచికచర్ల, కృత్తివెన్ను, గూడూరు మండలాల్లో 85 శాతం పంపిణీ పూర్తయిందని పేర్కొన్నారు. తోట్లవల్లూరు, ఘంటసాల, నందివాడ, కోడూరు, జి.కొండూరు, బాపులపాడు, మొవ్వ, పామర్రు, చాట్రాయి, జగ్గయ్యపేట, విస్సన్నపేట, కలిదిండి, ఉంగుటూరు, అవనిగడ్డ, వత్సవాయి, ఉయ్యూరు, గుడ్లవల్లేరు, ఎ.కొండూరు, కైకలూరు, మండవల్లి, చందర్లపాడు, గంపలగూడెం, చల్లపల్లి, తిరువూరు, మోపిదేవి, నూజివీడు, ఆగిరిపల్లి, ముసునూరు మండలాల్లో 80శాతం, రెడ్డిగూడెం, పెనమలూరు, నందిగామ, పెనుగంచిప్రోలు, గుడివాడ, ఇబ్రహీంపట్నం, పెదపారుపూడి, బందరు మండలాల్లో 75 శాతం, విజయవాడ నగర పరిధిలో సర్కిల్-1, సర్కిల్-2లో 65శాతం పైబడి పంపిణీ పూర్తయింది.
మరో రెండు రోజుల్లో నూరు శాతం పంపిణీ పూర్తి
మరో రెండు రోజుల్లో నూరు శాతం రేషన్ సరుకుల పంపిణీ పూర్తి చేస్తామని జిల్లా పౌర సరఫరాల అధికారి రవికిరణ్ ‘ఆంధ్రభూమి ప్రతినిధి’కి తెలిపారు. రేషన్ పంపిణీలో జిల్లాను రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషి చేసిన తహశీల్దార్లు, విఆర్‌ఓలు, డీలర్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

ప్రతి నీటిబొట్టుని కాపాడుకోవాలి
మైలవరం, ఫిబ్రవరి 8: ప్రస్తుత వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని మనకు లభ్యమయ్యే ప్రతి నీటి బొట్టును పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఉందని రాష్ట్ర జలవనరుల శాఖామంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సూచించారు. మైలవరం ఏరియాలోని సాగునీటి సంఘాల నేతల శిక్షణా కార్యక్రమం స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో సోమవారం జరిగింది. కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న మంత్రి ఉమా మాట్లాడుతూ నీటిని సద్వినియోగం చేసుకోకపోతే మనుగడ కష్టమన్నారు. వర్షంపైనే ఆధారపడి పంటలు పండించుకునే పరిస్థితులలో ప్రతి నీటి బొట్టు విలువైనదన్నారు. ఇందుకోసం ప్రాజెక్ట్‌ల నిర్మాణంపైనే ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా పోలవరం ప్రాజెక్ట్‌ను రాబోయే రెండేళ్ళలో పూర్తి చేయనున్నట్లు తెలిపారు. అదేవిధంగా పట్టిసీమ ప్రాజెక్ట్‌ను వచ్చే మార్చినాటికి పూర్తి చేయనున్నట్లు వెల్లడించారు. అంతేగాక ఇప్పటి వరకూ వర్షాలు పడితేనే పంటలు పండించుకునే మైలవరం, నూజివీడు నియోజకవర్గాలలోని దాదాపు మూడు లక్షల ఎకరాలకు నిరంతరం సాగునీటిని అందించే విధంగా పట్టిసీమ నుండి గోదావరి జలాలను గుడ్డిగూడెం ప్రాజెక్ట్ ద్వారా నాగార్జున సాగరు ఎడమకాలువ పరిధిలోని 117వ కిలోమీటరుకు రప్పించి పంటలను సస్యశ్యామలం చేయనున్నట్లు తెలిపారు. ఉన్న నీటిని సద్వినియోగం చేసుకునే విధంగా ప్రభుత్వం నీరు-చెట్టు, ఊటకుంటలు, జలసిరి పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా కాలువలలో నీరు సక్రమంగా ప్రవహించి చివరి భూములకు సైతం నీటిని నడిపించేందుకు గానూ నాగార్జున సాగరు కాలువలను ఆధునికీకరణ పనులు వేగవంతంగా సాగుతున్నట్లు వెల్లడించారు. వ్యవసాయం లాభసాటిగా ఉండాలన్నదే ప్రభుత్వ ధ్యేయం అన్నారు. సాగునీటి వనరుల వినియోగం, ప్రభుత్వ పథకాల అమలులో సాగునీటి సంఘాల నేతల భాగస్యామ్యం ఉండాలన్నారు. బందరు పోర్ట్ నిర్మాణానికి సంబంధించిన పనులు రెండేళ్ళలో పూర్తయి ఓడల ద్వారా రవాణా ప్రారంభమవుతుందన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు వివిధ రకాల సంస్థలు ముందుకు వచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. వీటి ద్వారా ఉద్యోగావకాశాలకు కొదువ లేదన్నారు. రాష్ట్రం అన్ని రంగాలలో ముందుకు పోతుంటే ఓర్వలేక ప్రతిపక్షాలు తప్పుడు ఆరోపణలు చేసి పబ్బం గడుపుకుంటున్నాయని ధ్వజమెత్తారు. కార్యక్రమంలో అపెక్స్ కమిటీ చైర్మన్ ఆళ్ళ గోపాలకృష్ణ, తిరువూరు మాజీ ఎమ్మెల్యే ఎన్ స్వామిదాసు, మార్కెట్ కమిటీ చైర్మన్ తాళ్ళూరి రామారావు, నీటి సంఘాల శిక్షకుడు వివి వర్లు, నీటి సంఘ నేతలు అశోక్ తదితరులు పాల్గొన్నారు.

చేనేత రుణమాఫీ సొమ్మును
లబ్ధిదార్ల ఖాతాలకే జమ చేయాలి
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, ఫిబ్రవరి 8: చేనేత సహకార సంఘాల రుణమాఫీ మొత్తాన్ని సంబంధిత వ్యక్తుల ఖాతాలకు జమ చేయాలని ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని తదుపరి కేసుల విచారణ సమయంలో అందజేయాలని రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ ముత్తంశెట్టి విజయనిర్మల చేనేత ఔళి శాఖ అధికారులను ఆదేశించారు. నగరంలోని ప్రభుత్వ అతిథిగృహంలో సోమవారం సమాచార హక్కు చట్టం కమిషనర్ యం.విజయనిర్మల కేసులను విచారించారు. ఈ సందర్భంగా జిల్లాలోని గూడూరు మండలంలోని పోలవరం మహాత్మాజీ చేనేత సహకార సంఘం లిమిటెడ్‌కు చెందిన సభ్యుల రుణమాఫీ కేసును సమాచార హక్కు చట్టంలో విచారించారు. జిల్లాకు చెందిన బకాయిల రుణమాఫీ మొత్తాన్ని చెల్లింపులు చేయకుండా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. సొసైటీని సభ్యుల క్రిందే గుర్తించాలన్నారు. సొసైటీలకు ఎటువంటి ఆస్తులు అప్పులు ఉండవన్నారు. ప్రభుత్వం చేనేత సహకార సంఘాల సభ్యులకు వర్తింప చేసిన రుణమాఫీ మొత్తాన్ని పూర్తిగా తమకు అందజేయాలని దీనిపై సమాచార హక్కుచట్టం ద్వారా తగు ఉత్తర్వులు అందజేయవలసిందిగా పోలవరం మహాత్మాజీ చేనేత సహకార సంఘం లిమిటెడ్‌కు చెందిన సభ్యులు కమిషనర్‌కు విజ్ఞప్తి చేశారు. దీనిపై చేనేత ఔళి శాఖకు చెందిన రుణమాఫీ, సభ్యులకు చెల్లించిన, చెల్లించవలసిన వివరాలు, నిల్వ ఉన్న నగదు వంటి పలు వివరాలను తదుపరి అనగా ఈ నెల 15వ తేదీ సోమవారం పూర్తి సమాచారాన్ని సమర్పించాలని సమాచార హక్కుచట్టం కమిషనర్ యం.విజయనిర్మల చేనేత ఔళిశాఖ అధికారులను ఆదేశించారు.