ఆంధ్రప్రదేశ్‌

అవినీతి పాలన, ప్రజాసమస్యలపై పోరాటాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), ఫిబ్రవరి 20: రానున్న ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయానికి వ్యూహరచన చేస్తున్నామని ఎపిసిసి అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి చెప్పారు. సోమవారం ఉదయం నగరంలోని ఎపిసిసి కార్యాలయంలో జిల్లా, నగర కాంగ్రెస్ అధ్యక్షులు, పెద్దనోట్ల రద్దు వ్యతిరేక ప్రచార కమిటీ చైర్మన్లతో నిర్వహించిన సమావేశంలో చర్చించిన అంశాలను ఆయన విలేఖర్లకు వివరించారు. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం చంద్రబాబు అవినీతి పాలనపైనే కాకుండా ప్రజాసమస్యలపై పోరాటాలు చేసి పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో నెలకొన్న కరవు, మంచినీటి సమస్యలపై, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై ఈ నెల 25న అన్ని జిల్లాల కలెక్టర్లకు వినతిపత్రాలు అందిస్తామన్నారు. పెద్దనోట్ల రద్దు దుష్పరిణామాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను నిరసిస్తూ జన ఆవేదన సమ్మేళన సదస్సులను జిల్లాల్లో ఈ నెల 26 నుంచి మార్చి 1 వరకూ, మార్చి 5 నుంచి 15 వరకూ 175 నియోజకవర్గాల్లోనూ నిర్వహిస్తామన్నారు. ప్రత్యేక హోదా అమలు, 2014 టిడిపి మ్యానిఫెస్టో హామీల అమలు అంశాలపై మార్చి 5 నుంచి 30 వరకూ అన్ని నియోజకవర్గాల్లో ప్రజాబ్యాలెట్ నిర్వహిస్తామని తెలిపారు. గతంలో ప్రత్యేక హోదా కోసం కోటి సంతకాలు సేకరించిన మాదిరిగానే ప్రస్తుతం రెండు కోట్ల మంది ప్రజల అభిప్రాయాలను సేకరిస్తామన్నారు. దివంగత ప్రధాని ఇందిరా గాంధీ శత జయంతి ఉత్సవాలను ‘ఇందిరమ్మ రాజ్యం- ఇంటింటా సౌభాగ్యం’ అనే నినాదంతో ఊరూరా నిర్వహించి పార్టీ బలోపేతానికి కృషి చేస్తామన్నారు. టిడిపి పాలనలో మహిళలకు రక్షణ కొరవడిందనడానికి రాజధాని ప్రాంత గ్రామమైన క్రోసూరు మండలం ఉయ్యందనలో బాలిక కిడ్నాప్, అత్యాచారం ఘటనే నిదర్శనమన్నారు. ఈ ఘటనలో టిడిపి నేతల ప్రమేయంతో కేసును పక్కదారి పట్టించేందుకు చేస్తున్న దుశ్చర్యలు శోచనీయమని ఖండించారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేసి దోషులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు.