ఆంధ్రప్రదేశ్‌

ఇంధన పొదుపులో మనమే ఫస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 20: విద్యుత్ సమర్థ వినియోగంలో మనమే ముందున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. రాష్ట్రంలో నాణ్యమైన నిరంతర విద్యుత్‌ను అందుబాటు ధరల్లో అందిస్తూనే పొదుపు, సంరక్షణ విధానాలను అలవాటు చేయడం ద్వారా నెలవారీ బిల్లులు తగ్గేలా ఏపి స్టేట్ ఎనర్జీ ఎఫిషియంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇళ్లల్లో విద్యుత్తును అతి స్వల్పంగా వినియోగించే ఎల్‌ఈడి బల్బులు, ఫ్యాన్లు తక్కువ ధరకు వినియోగదారులకు అందించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఈ నెల 23న ఎల్‌ఈడి ట్యూబ్‌లైట్ల పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్న నేపథ్యంలో ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్, ట్రాన్స్‌కో సీఎండి విజయానంద్, ఇంధన సలహాదారు రంగనాథం, డిస్కమ్‌ల సిఎండీలు ఎంఎం నాయక్, హెచ్‌వై దొర, ఏపి ట్రాన్స్‌కో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్లు దినేష్ పరుచూరి, ఉమాపతితో ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం ఇక్కడ సమీక్షించారు. ఎల్‌ఇడి బల్బులు, 5 స్టార్ రేటింగ్ కలిగిన ఫ్యాన్లు, వ్యవసాయ మోటార్లను వినియోగించడంలో ముందున్నామని చెప్పారు. సమర్థ విద్యుత్ ఉపకరణాల వినియోగంతో కరెంటు బిల్లులు ఎంతమేరకు తగ్గుతాయో వివరించగలిగినప్పుడు మరింత స్వచ్ఛందంగా ప్రజాస్పందన వస్తుందని ముఖ్యమంత్రి సూచించారు. ఈ సమయంలో అజయ్ జైన్ మాట్లాడుతూ బహిరంగ మార్కెట్‌లో రూ.500 విలువ చేసే ఎల్‌ఈడి ట్యూబ్‌లైట్‌ను వినియోగదారులకు రూ.230కే అందించనున్నామని చెప్పారు. ఎల్‌ఈడి ట్యూబ్‌లైట్లు సంప్రదాయక ట్యూబ్‌లైట్ల కంటే నాణ్యమైన కాంతినిస్తాయని, మూడేళ్ల లోపల ఏవైనా సాంకేతిక లోపాలు తలెత్తితే వాటి స్థానంలో కొత్తవాటిని ఇస్తామని చెప్పారు. విద్యుత్ వినియోగంలో ఇప్పటికే చేపట్టిన చర్యలు మంచి ఫలితాలిస్తున్నాయని, గతంలో ఉచితంగా పంపిణీ చేసిన ఎల్‌ఈడి బల్బులను వాడుతున్న వినియోగదారులంతా సంవత్సరానికి రూ.250 నుండి రూ.400 వరకు ఆదా చేస్తున్నారని అజయ్ జైన్ తెలిపారు.