ఆంధ్రప్రదేశ్‌

మయూర వాహనంపై దర్శనమిచ్చిన శ్రీశైలేశ్వరుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీశైలం, ఫిబ్రవరి 20: శ్రీశైలంలో జరుగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం స్వామి అమ్మవార్లు మయూర వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవాల్లో భాగంగా ఉదయం స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు, చండీశ్వరునికి ప్రత్యేక పూజలు, లోక కల్యాణం కోసం జపాలు, మండపారాధనలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. సాయంత్రం ప్రదోషకాల పూజలు, హోమాలు, జపానుష్టానాలు జరిపించారు. అనంతరం అక్కమహాదేవి మండపంలో స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను మయూర వాహనంపై ఆశీనులను జేయించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహా మంగళహారతి అనంతరం మేళతాళాల నడుమ శ్రీగిరి పురవీధుల్లో గ్రామోత్సవం కన్నుల పండువగా నిర్వహించారు. గ్రామోత్సవం ముందు భాగాన ప్రదర్శించిన జానపద కళారూపాలు, పుట్టబొమ్మలు, కోళాటాలు, గొరవయ్య నృత్యాలు, పగటి వేషాలు, చెక్క్భజనలు భక్తులను అలరించాయి. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో నారాయణ భరత్‌గుప్తా, ఆలయ అధికారులు, అర్చక వేదపండితులు పాల్గొన్నారు. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం స్వామి, అమ్మవార్లకు రావణవాహన సేవ నిర్వహించనున్నారు.