ఆంధ్రప్రదేశ్‌

పోదాం పదరా...శ్రీశైలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీశైలం, ఫిబ్రవరి 20: శ్రీశైలంలో కొలువైన పరమశివుడి దర్శనానికి భక్తులు భారీగాతరలివస్తున్నారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను కనులారా వీక్షించేందుకు సుదూర ప్రాంతాల నుంచి కాలినడకన భక్తులు శ్రీగిరి చేరుకుంటున్నారు. శివదీక్ష స్వీకరించిన శివస్వాములు, భక్తులు రాష్ట్రం నలుమూలల నుండి కాలినడకన, వాహనాల్లో శ్రీశైలం చేరుకొని స్వామి, అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు. సుదూర ప్రాంతాల నుంచి ముఖ్యంగా కర్నాటక నుంచి భక్తులు పెద్దసంఖ్యలో తరలివస్తున్నారు. ఏడాదికొకసారి కర్నాటక భక్తులు కాలినడకన ఆరోగ్యాన్ని, ఎండలను సైతం లెక్కచేయక శ్రీశైలం చేరుకోవడం ఆనవాయితీగా వస్తోంది.
దారి పొడవునా దాతలు వీరికి భోజనం, వసతి కల్పిస్తున్నారు. కాలినడక భక్తులకు దేవస్థానం వారు కైలాస ద్వారం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తాగునీరు, సేద తీరేందుకు చలువ పందిర్లు, షామియానాలు ఏర్పాటు చేశారు. వైద్యశిబిరాలు ఏర్పాటుచేసి అవసరమైన వైద్యం అందిస్తున్నారు. భక్తులు పవిత్ర పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు ఏర్పాట్లు చేశారు. పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్తులు వేకువ జామునే పోటీ పడుతున్నారు. మహిళలు దుస్తులు మార్చుకొనేందుకు ప్రత్యేక గదులు ఏర్పాటుచేశారు. పాతాళగంగలో స్నానం ఆచరించే భక్తులు, లోతట్టు ప్రాంతాలకు వెళ్లకుండ బారికేడ్లు ఏర్పాటుచేశారు. నైపుణ్యం గల గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచారు. ప్రత్యేక షైన్‌బోట్లు అందుబాటులో ఉంచారు. సిసి కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు సమాచారాన్ని అధికారులను చేరవేస్తున్నారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల నేపధ్యంలో శ్రీగిరికి వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. దీంతో ఆలయ పురవీధులు కిక్కిరిసిపోతున్నాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు ఆలయ దర్శన వేళల్లో మార్పులు చేశారు. శివస్వాములకు ప్రత్యేక క్యూలైన్ల ద్వారా దర్శనాన్ని కల్పిస్తున్నారు. బ్రేక్ సమయాల్లో విఐపి దర్శనాలను అనుమతిస్తూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటున్నారు.

చిత్రం..కాలినడకన శ్రీశైలం చేరుకుంటున్న శివస్వాములు