ఆంధ్రప్రదేశ్‌

హద్దులు మీరొద్దు... ప్రజల మైండ్‌సెట్ తెలుసుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఫిబ్రవరి 21: వ్యక్తిగత ప్రతిష్టలతో పార్టీని బలహీనపరిస్తే సహించేదిలేదు.. ఇప్పటికైనా మైండ్‌సెట్ మార్చుకోండి..మరో రెండేళ్లలో ఎన్నికలు వస్తున్నాయి.. ఇదే తీరున గ్రూపుల పోరుతో బజారున పడితే ఉపేక్షించేదిలేదని తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జిలను సున్నితంగా మందలించారు. గుంటూరు జిల్లాలో పార్టీ పరిస్థితి దారుణంగా ఉంది.. పార్టీ స్థితిగతులపై సమీక్షలు లేవు.. కార్యకర్తలను పట్టించుకోవటంలేదని మండిపడ్డారు..జిల్లాలో పార్టీ పరిస్థితిపై మంగళవారం రాత్రి మూడు గంటల పాటు సిఎం తన నివాసంలో సమీక్ష జరిపారు. సాంఘిక సంక్షేమశాఖ మంత్రి రావెల కిషోర్ బాబు, జడ్పీ చైర్‌పర్సన్ జానీమూన్‌ల మధ్య విభేదాలకు కారణాలను తెలుసుకున్నారు. కార్యకర్తలను కలుపుకుని పోవాల్సిన బాధ్యత మీపై ఉంది. ఏదైనా సమస్య వచ్చినప్పుడు సమన్వయం చేయాలి.. అలివి కాకపోతే అధిష్టానం దృష్టికి తీసుకురావాలి.. వీధినపడితే క్రమశిక్షణ చర్యలు తప్పని కూడా హెచ్చరించినట్లు సమాచారం. ఎమ్మెల్యేలు, ఇతర నాయకుల మధ్య సమన్వయం కుదిరించే ప్రయత్నాలు మీరెందుకు చేయటంలేదని మంత్రి పుల్లారావును సిఎం ప్రశ్నించినట్లు తెలిసింది. మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య సమన్వయం లోపించింది.. నా దగ్గర మొత్తం రికార్డులు ఉన్నాయి.. ఎవరేం చేస్తున్నారో తెలుసు.. కలిసి పనిచేస్తేనే భవిష్యత్తు ఉంటుందని స్పష్టం చేశారు. ప్రధానంగా బాపట్ల నియోజకవర్గం సూర్యలంక రెస్టారెంట్‌పై ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ అనుచరులతో దాడి ఘటనపై సీఎం తీవ్రంగా స్పందించినట్లు తెలిసింది. అధికారంలో ఉన్నాంకదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే ఆ బురద పార్టీపై పడుతుంది.. మీరు చేసే తప్పులకు నేను జవాబుదారీ కావాలి..సహనం వహిస్తున్నా..పద్దతులు మార్చుకుంటే మంచిదని ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ అభివృద్ధి..సంక్షేమ కార్యక్రమాలకు ప్రచారం కరవైంది.. ఆర్ధిక ఇబ్బందుల్లో ఉండి కూడా ప్రజలకు ఏం చేయాలనేది ఆలోచిస్తున్నా.. నాతో కలసి కష్టపడండి.. ఎవరితీరున వారు వ్యవహరిస్తే క్రమశిక్షణ చర్యలకు వెనుకాడేదిలేదని హెచ్చరించినట్లు సమాచారం. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి తన నియోజకవర్గంలో కొందరు నేతలు పెత్తనం చలాయిస్తున్నారని సిఎంకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. జిల్లాలో గ్రూపుల పోరుపై మరోసారి వ్యక్తిగతంగా పిలుపులు ఉంటాయని స్పష్టం చేశారు.