ఆంధ్రప్రదేశ్‌

రూ.కోటి విలువైన ఎర్రచందనం స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, ఏప్రిల్ 11: నేపాల్‌కు చెందిన స్మగ్లర్లతో సంబంధాలు కలిగి యథేచ్ఛగా ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్న నలుగురిని సోమవారం కడప జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 169 దుంగలు, నాలుగు వాహనాలు, ఆరుసెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ డాక్టర్ నవీన్‌గులాఠి తెలిపారు. జిల్లా పోలీసులు, ఎర్రచందనం టాస్క్ఫోర్స్ నిర్వహించిన జాయింట్ ఆపరేషన్‌లో గోపవరం మండలం బద్వేలు -నెల్లూరు రహదారిలో పిపి కుంట చెక్ పోస్టు వద్ద అంతర్ రాష్ట్ర స్మగ్లర్లు టి వెంకటేశ్వరరెడ్డి, షేక్ నజీర్, షేక్ సుజీత్, షేక్ ఆలీఫ్‌లను అరెస్టు చేశారు. వీరివద్ద 1.1 టన్ను బరువుగల 40 దుంగలు, అశోక్ లేలాండ్ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం విలువ కోటి రూపాయల వరకు ఉంటుంది. అరెస్టు చేసిన స్మగ్లర్లను విచారించగా గోపవరం మండలం బ్రాహ్మణపల్లె గ్రామం వద్ద మల్లెకొండేశ్వరస్వామి గుడి రాస్తా వద్ద పొదల్లో షేక్ సుజీత్, షేక్ అలీఫ్‌లను అరెస్టు చేసి దుంగలతో ఉన్న స్కార్పియో, స్విఫ్ట్ కారు, ఆరుసెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఘటనా స్థలంలో దుంగలను లోడ్ చేస్తున్న స్మగ్లర్లు పోలీసులపై రాళ్లు రువ్వుతూ పారిపోయారు. ఇదిలావుండగా బీహార్‌లోని నేపాల్ సరిహద్దు కూల్ పరస్ వద్ద ఈనెల 5న పోలీసు బృందం వెళ్లి నిందితులు దాచిన 1.1 టన్నుల దుంగలు స్వాధీనం చేసుకున్నారు. అక్కడివారు ఇచ్చిన సమాచారం మేరకు వీరిని అరెస్టు చేశారు. పట్టుబడిన వెంకటేశ్వరరెడ్డి హైదరాబాద్‌లో గార్మెంట్ షాప్ నిర్వహించేవాడు. అప్పులు పెరగడంతో స్మగ్లింగ్ ప్రారంభించాడు. జిల్లాలోని బద్వేలు, మైదుకూరు, పోరుమామిళ్లతోపాటు నెల్లూరులోని వింజమూరు, మర్రిపాడు, ఉదయగిరికి చెందిన స్మగర్లతో ఈయనకు సంబంధాలున్నాయి. దుంగలను కర్నాటక, తమిళనాడు, రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌కు చెందిన స్మగ్లర్లకు విక్రయించేవాడు. ఇతనిపై మొత్తం 6 కేసులు ఉన్నాయి. పట్టుబడిన వారు రవాణా కార్యాలయాల ద్వారా పార్సిళ్ల పేరిట కంటైనర్‌ను బుక్ చేసుకుని హర్యానా, రాజస్తాన్, బీహార్, ఢిల్లీలకు తరలించేవారని ఎస్పీ తెలిపారు.