ఆంధ్రప్రదేశ్‌

ఏడు నెలల గర్భం మాయం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆత్మకూరు, ఏప్రిల్ 13: ఏడు నెలల గర్భవతికి హటాత్తుగా గర్భం మాయమయింది. దేవుడే తన గర్భాన్ని తీసుకెళాల్డని, తిరిగి మూడు నెలల తరువాత ఇస్తాడని ఆ మహిళ చెబుతుండగా, ఇదంతా దైవ మహిమ అంటూ ఆమెను చూసేందుకు జనం తండోపతండాలుగా వస్తున్నారు. గ్రామ సర్పంచ్ నరసింహులు, ఆమె భర్త పోలన్న తెలిపిన వివరాల మేరకు.. అనంతపురం జిల్లా అత్మకూరు మండల పరిధిలోని సింగంపల్లి గ్రామానికి చెందిన అలివేలమ్మ (35) ఏడు నెలల గర్భవతి. అలివేలమ్మ ఆమె గర్భం దాల్చగానే సమీపంలోని బత్తలపల్లి ఆర్డీటీ ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకుంది. డాక్టర్లు సూచించిన ప్రకారం క్రమం తప్పకుండా ఆసుపత్రికి వెళ్లి సంబంధిత పరీక్షలు చేయించుకుంటోంది. జూన్ 25 ప్రాంతంలో ప్రసవం జరుగుతుందని డాక్టర్లు చెప్పారు. ఇలాఉంటే ఈ నెల 10వ తేదీ అర్ధరాత్రి అలివేలమ్మకు ఒక కల వచ్చింది. ఆ కలలో తనబిడ్డను ఎవరో ఎత్తుకుపోతున్నారంటూ ఉలిక్కిపడి లేచి గట్టిగా కేకలు వేసింది. ఆమె కేకలు విన్న భర్త పోలన్న ఏమైందంటూ నిద్రలేచి కంగారు పడ్డాడు. ఆమె తనకు వచ్చిన కల గురించి చెప్పింది. దీంతో భయపడ్డ ఆతడు చుట్టుపక్కల వారిని లేపేందుకు బయటకు వెళ్లాడు. తిరిగి 10 నిమిషాల తరువాత ఇంట్లోకి వచ్చేసరికి అలివేలమ్మ గర్భం మాయమయింది. ఎత్తుగా ఉండాల్సిన పొట్ట సాధారణ స్థితికి వచ్చేసింది. ఈ విషయం తెలిసి, ఇదంతా దైవ మహిమగా భావించిన చుట్టుపక్కల గ్రామాల జనం గత మూడు రోజులుగా ఆమెను చూసేందుకు తరలి వస్తున్నారు. అంతే కాకుండా ఆమె ఇంటి వద్ద భజనలు కూడా చేస్తున్నారు. అలివేలమ్మ కూడా గత మూడు రోజులుగా అప్పుడప్పుడు పూనకం వచ్చి ఊగిపోతోంది. కాగా ఇది ఏదోకథల పుస్తకంలో చదువుతున్నట్టుగా ఉందని గైనకాలజీ డాక్టర్ షంషాద్ బేగం అన్నారు. కొంతమంది హిస్టీరియా వ్యాధిగ్రస్తులు ఈ విధంగా వ్యవహరిస్తూ ఉంటారని, కొంతమంది తమకు గర్భం వచ్చినట్లుగా నమ్మించే యత్నం చేస్తుంటారన్నారు.
అలివేలమ్మకు ఆసుపత్రి సిబ్బంది ఇచ్చిన కార్డు

వాహనం ఢీకొని ఎలుగుబంటి మృతి
తిరుమల, ఏప్రిల్ 13: తిరుమలకు వెళ్లే రెండో కనుమదారిలో గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ ఎలుగుబంటి మృతి చెందింది. బుధవారం తెల్లవారుజామున 5.30 గంటల ప్రాంతంలో ఘాట్ రోడ్డులోని 12వ కిలోమీటర్లు వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఏదైనా గుర్తు తెలియని భారీ వాహనం ఢీకొనడంతో ఎలుగుబంటి తలకు బలమైన గాయం తగిలి చనిపోయి ఉంటుందని, ఈ ఎలుగుబంటికి 5 నుంచి ఏడేళ్ళ వయస్సు ఉంటుందని ఫారెస్టు సిబ్బంది తెలిపారు. ఘాట్‌రోడ్డు పెట్రోలింగ్ సిబ్బంది ద్వారా సమాచారం అందుకున్న టిటిడి అటవీశాఖ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకునే లోపుఎలుగుబంటి మృతి చెందింది. అలిపిరి రేంజ్ బీట్ ఆఫీసర్ బాలసుబ్రమణ్యం సిబ్బందితో కలసి సంఘటనా స్థలానికి చేరుకుని ఎలుగుబంటి కళేబరానికి పంచనామా నిర్వహించి అనంతరం ఖననం చేసేందుకు తిరుపతికి తరలించారు.
అభివృద్ధి కోసమే మార్పు: సుజయకృష్ణ
ఆంధ్రభూమి బ్యూరో
విజయనగరం, ఏప్రిల్ 13: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కొన్ని సమస్యలు ఉన్నాయి.. ఈ పరిస్థితుల్లో పార్టీలో ఇమడలేక పోతున్నాను.. మూడేళ్లుగా నియోకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడివక్కడ నిలచిపోయాయి.. అభివృద్ధి కోసమే పార్టీ మారాలని నిర్ణయించుకున్నాను.. అని బొబ్బిలి ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావు సన్నిహిత అనుచరుల ముందు వ్యాఖ్యానించినట్లు సమాచారం. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పి టిడిపిలో చేరేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో బుధవారం సాయంత్రం నుంచి ఆయన బొబ్బిలిలోని తన కోటలో సన్నిహితులతో సమావేశాలు నిర్వహించారు. తొలుత బాడంగి నియోజకవర్గానికి చెందిన అనుచరులతో రహస్యంగా సమావేశమయ్యారు. అభివృద్ధిని దృష్టిలో పెట్టుకునే టిడిపిలో చేరాలనే నిర్ణయానికి వచ్చానని ఎమ్మెల్యే అన్నట్లు సమాచారం. ఇప్పటి వరకు సహకరించినట్టుగా పార్టీ మారాక పూర్తి సహాయసహకారాలు అందించాలని కోరినట్లు తెలుస్తోంది.
28న షార్‌కు ప్రధాని మోదీ రాక
సూళ్లూరుపేట, ఏప్రిల్ 13: నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం (షార్)కు ప్రధాని నరేంద్రమోదీ రానున్నారు. షార్ కేంద్రం నుండి 28న పిఎస్‌ఎల్‌వి-సి 33 రాకెట్ ప్రయోగం జరగనుంది. ఈ ప్రయోగాన్ని వీక్షించేందుకు ప్రధాని షార్‌కు రానున్నట్లు తెలిసింది. నావిగేషన్ సేవలకు సంబంధించిన సీరిస్‌లో ఇది చివరి ప్రయోగం కావడంతో ఇస్రో వర్గాలు ప్రధానిని షార్‌కు రప్పిస్తున్నారు. ఈ సిరీస్‌లో ఇప్పటి వరకు ప్రయోగించిన ఆరు ప్రయోగాలు విజయవంతమయ్యాయి. చివరి ప్రయోగం ప్రధాని సమక్షంలో విజయవంతం చేసి జిపిఎస్ సేవలను దేశానికి అంకితం చేయనున్నారు. ప్రధాని పర్యటన ఖరారు అయినట్లు పిఎంవో కార్యాలయం నుండి ఇస్రో ప్రధాన కార్యాలయానికి సమాచారం అందింది. అదే రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా రానున్నట్లు సమాచారం. వీరితో పాటు పలువురు కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు రానున్నారు.
సింహాచలంలో బాణసంచా నిషేధం
సింహాచలం, ఏప్రిల్ 13: సింహాచలక్షేత్రంలో ఈనెల 18న జరుగనున్న శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి కల్యాణోత్సవాల్లో బాణసంచా కాల్చడాన్ని నిషేధించారు. కేరళలోని పుట్టింగల్‌దేవీ ఆలయంలో జరిగిన సంఘటన దృష్ట్యా సింహాచలంలో సైతం దీనిపై నిషేధం విధించినట్లు అధికారులు తెలిపారు. ప్రతి ఏటా స్వామివారి కల్యాణోత్సవానికి ముందు జరిగే రథోత్సవంలో భారీ ఎత్తున బాణసంచా కాల్చడం ఆనవాయితీగా వస్తోంది. స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తుల ఎదుట బాణసంచా పేల్చడం ఇక్కడి ఆచారం. సుమారు అరగంట పాటు ఈ విన్యాసాలు కొనసాగుతాయి. వేలాదిగా తరలివచ్చే భక్తులను బాణసంచా విన్యాసాలు అబ్బురపరుస్తాయి. అయితే కేరళ దుర్ఘటన నేపధ్యంలో ఈసారి సింహాచలంలో బాణసంచాపై నిషేధం విధించారు.
బావిలో దూకి తల్లీబిడ్డల ఆత్మహత్య
రాజాం, ఏప్రిల్ 13: ఓ తల్లి తన ఇద్దరు కూతుళ్లతో కలిసి బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. శ్రీకాకుళం జిల్లా రాజాం మండలం గడిముడిదాం గ్రామంలో బుధవారం జరిగిన సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన సింహాచలం, లక్ష్మి దంపతులకు ముగ్గురు అమ్మాయిలు అనురాధ, నీలిమ, శ్రావణి. వీరంతా స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. కుటుంబ కలహాల నేపధ్యంతో జీవితంపై విరక్తిచెందిన లక్ష్మి(30) పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. బుధవారం ఉదయం బడికివెళ్లిన పిల్లలను పని ఉందని చెప్పి వెంటబెట్టుకుని గ్రామశివారులోని శ్మశానవాటిక వద్దకు చేరుకుంది. అక్కడే ఉన్న నేలబావిలోకి తొలుత ఇద్దరు పిల్లలు శ్రావణి(8), నీలిమ(7)ని తోసేసింది. అనంతరం తానూ దూకి ఆత్మహత్య చేసుకుంది. ఇది గమనించిన చుట్టుపక్కల వారు బావివద్దకు చేరుకునేలోగా ముగ్గురూ మృత్యువాతపడ్డారు.
18న మంత్రివర్గ సమావేశం
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, ఏప్రిల్ 13: ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ సమావేశం ఈ నెల 18న విజయవాడలో జరగనుంది. ఉదయం 10.30 గంటలకు క్యాబినెట్ సమావేశం జరగబోతోంది. ఈ క్యాబినెట్‌లో ఎస్సీ, ఎస్టీల సంక్షేమ పథకాలు, అందరికీ ఇళ్లు, రాజధానికి ఉద్యోగుల తరలింపు తదితర అంశాలపై చర్చించే అవకాశాలు ఉన్నాయి.

నేడు ముంబయకు ముఖ్యమంత్రి బాబు
మెరిటైం సమ్మిట్‌లో పాల్గోనున్న సిఎం
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, ఏప్రిల్ 13: ముంబైలో గురువారం నుంచి రెండు రోజులపాటు జరగనున్న మెరిటైం సమ్మిట్‌లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం ఇక్కడి నుంచి బయల్దేరి వెళ్లనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో సముద్ర ఆధారిత ప్రాజెక్ట్‌లను ఏర్పాటు చేయడానికి ఉన్న అవకాశాలను ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సదస్సుకు హాజరవుతున్న ప్రతినిధులకు వివరించనున్నారు. షిప్ నిర్మాణం, మరమ్మతులు, నౌకల పునర్నిర్మాణం, డ్రగ్జర్ల నిర్మాణం, కొత్త పోర్టుల ఏర్పాటు, ఇన్‌లాండ్ వాటర్‌వేస్ అభివృద్ధి, సముద్ర మార్గంలో కార్గో, ప్రయాణికుల రవాణా, కోస్టల్ షిప్పింగ్, క్రూయిజ్ సర్వీసెస్, లైట్ హౌస్‌లు, క్రూయిజ్ టూరిజం ఏర్పాటుకు ఉన్న అవకాశాలను సిఎం వివరించనున్నారు. వివిధ దేశాల నుంచి 2000 మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. రాష్ట్రంలో పోర్టు ఆధారిత పరిశ్రమలను, ప్రాజెక్ట్‌ల్లో పెట్టుబడులను ఆకర్షించడానికి సదస్సుకు హాజరవుతున్నారు.

విశాఖ, అమరావతిలో
ఆధునిక నైపుణ్య కేంద్రాలు
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, ఏప్రిల్ 13: విశాఖ, అమరావతిలో అత్యాధునిక నైపుణ్య అభివృద్ధి కేంద్రాలను నెలకొల్పడానికి సింగపూర్‌కు చెందిన క్రిమన్స్ లాజిక్, సన్‌టెక్, సింగపూర్ ఇ-గవర్నెన్స్ లీడర్‌షిప్ సెంటర్ వంటి సంస్థలు ఆసక్తి కనబరిచాయని మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, నారాయణ పేర్కొన్నారు. ఈ-ప్రగతి అంశంపై ఈనెల 11 నుంచి 13వ తేదీ వరకూ ఈ ఇద్దరు మంత్రులు సింగపూర్‌లో ప్రముఖ ఐటి కంపెనీలను, ప్రభుత్వ ప్రతినిధులను కలిసి చర్చించారు. మన రాష్ట్రంలో అమలు జరుగుతున్న ఈ ప్రగతి, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఐటి అనెబుల్డ్ సర్వీసెస్ ద్వారా ప్రజలకు అందిస్తున్న మెరుగైన సేవలు, ఐటి పాలసీలను సింగపూర్ ప్రతినిధులకు వివరించారు. వచ్చే నెలలో సింగపూర్‌లో ప్రసిద్ధ ఐటి కంపెనీలతో ఐటి స్టార్టప్ ఈవెంట్ నిర్వహిస్తున్నామన్నారు. పర్యటనలో భాగంగా సింగపూర్‌లోని ప్రముఖ ఐటి సంస్థ క్రిమ్సన్ లాజక్ కంపెనీ సిఇఓ టెంగ్‌తో మంత్రులు నారాయణ, రఘునాథరెడ్డి భేటీ అయ్యారు. ప్రపంచవ్యాప్తంగా ఇ-గవర్నెన్స్ సొల్యూషన్స్ అందించే క్రిమ్సన్ లాజిక్ సంస్థ తమ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏపి ప్రభుత్వానికి ఈ ప్రగతి, ఐటి శాఖలతో పంచుకోడానికి ముందుకు వచ్చింది. సింగపూర్ ఇ-గవర్నమెంట్ లీడర్‌షిప్ సెంటర్ డైరక్టర్ అశోక్ కుమార్‌తో మంత్రులు భేటీ అయ్యారు. విమెరైన్ బే ఫైనాన్షియల్ సెంటర్‌లో ఉన్న ప్రపంచ బ్యాంక్ కార్యాలయ ప్రతినిధులు రణదీప్ సుతాన్, అబ్బాస్ కె ఝుల్‌లను కలిసి రాష్ట్భ్రావృద్ధికి ప్రపంచ బ్యాంక్ తోడ్పాటు కావాలని కోరారు. సింగపూర్ ప్రభుత్వ విదేశీ వ్యవహారాల అంబాసిడర్ గోపీనాథ్ పిళ్ళైని మంత్రుల బృందం కలిసి ఈ ప్రగతి గురించి వివరించారు. సన్‌టెక్ సంస్థను కలిసి కృష్ణా పుష్కరాల్లో క్రౌడ్ కంట్రోల్, ఫేస్ రికగ్నజైషన్ కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించాలని ఆ సంస్థ సిఇఓ కెన్‌టాంగ్‌కు మంత్రులు నారాయణ, రఘునాథరెడ్డి వివరించారు. నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ సింగపూర్ ఆధ్వర్యంలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ సౌత్ ఏషియన్ సర్వీస్ సెంటర్ డైరక్టర్ దీపక ముఖర్జీ, ఇనిస్టిట్యూట్ ఆఫ్ సిస్టమ్స్ సైన్స్ చీఫ్ ట్యాన్‌పెంగ్‌లను, సింగపూర్ ప్రభుత్వం సంస్థ అర్బన్ రెగ్యులేటరీ అథారిటీ, బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ సీనియర్ అధికారులు టెంగ్ వి బంగ్, సీనియర్ ప్లానర్ వ్యాంగ్‌లను కలిశారు.