ఆంధ్రప్రదేశ్‌

కెసిఆర్ కనుసన్నలలో బాబు పాలన: రఘువీరా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మడకశిర, ఏప్రిల్ 16: తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు సూచనల మేరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాలన సాగిస్తూ ప్రజలను, సంక్షేమాన్ని విస్మరిస్తున్నారని పిసిసి అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి విమర్శించారు. శనివారం అనంతపురం జిల్లా మడకశిర మండలం నీలకంఠాపురంలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ, రాష్ట్ర విభజన సమయంలో ఎనిమిది గ్రామాలను పూర్తిగా తెలంగాణలో కాకుండా ఆంధ్రాలో విలీనం చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. అయితే ఓటుకు నోటు కేసులో చంద్రబాబు ముద్దాయి కావడంతో ఆ కేసు నుండి తప్పించుకోవడానికి చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే, విలీనం అయిన గ్రామాల ప్రజల అనుమతి, రాష్ట్ర ఎంపిలు, ఎమ్మెల్యేల అభిప్రాయాలు తీసుకోకుండా ఆ గ్రామాలను తిరిగి తెలంగాణలో కలపాలని చంద్రబాబు సొంత నిర్ణయం తీసుకోవడం తగదన్నారు. విలీన గ్రామాలపై కనీసం చంద్రబాబు టిడిఎల్‌పి సమావేశం ఏర్పాటు చేసి మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేల అభిప్రాయాలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. చంద్రబాబు మంత్రదండం కెసిఆర్ చేతిలో ఉందని రఘువీరా ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రభుత్వం 160 టిఎంసిల కృష్ణా జలాలను అక్రమంగా తోడి వేసే ప్రాజెక్టులు నిర్మిస్తున్నా దానిపై చంద్రబాబు ఏమాత్రం నోరు మెదపడం లేదన్నారు.