ఆంధ్రప్రదేశ్‌

జర్నలిస్టులపై దాడుల నివారణకు హై పవర్ కమిటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 16: జర్నలిస్టులపై దాడులను అరికట్టేందుకు ఉన్నతాధికార కమిటీని నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హోం మంత్రి అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ కమిటీలో వైస్ చైర్మన్‌గా సమాచార శాఖ మంత్రి, సభ్యులుగా హోంశాఖ, సాధారణ పరిపాలన శాఖ (పొలిటికల్) ముఖ్య కార్యదర్శులు, సమాచార శాఖ కార్యదర్శి, శాంతిభద్రతల విభాగం ఐజి, ఎపియుడబ్ల్యూజె, ఎపి ఫోటో జర్నలిస్టుల అసోసియేషన్, ఎపి ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్, చిన్న, మధ్య తరహా వార్తాపత్రికల అసోసియేషన్, ఎపి వర్కింగ్ జర్నిలిస్టుల ఫెడరేషన్, జాప్, ఎపి జర్నలస్టుల ఫోరమ్‌ల నుంచి ఒక్కొక్కరిని, సభ్య కన్వీనర్‌గా సమాచార శాఖ కమిషనర్‌ను ఉన్నతాధికార కమిటీలో నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీ రెండేళ్ల పాటు కొనసాగుతుందని, జర్నలిస్టులపై దాడులు జరిగితే విచారణ జరిపి నిందితులపై తగు చర్యలు తీసుకునే విధంగా వ్యవహరిస్తుందని ప్రభుత్వం వెల్లడించింది.