ఆంధ్రప్రదేశ్‌

రోజాపై సభ సుమోటోగా కేసు నమోదు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 9: ప్రజాస్వామ్యంలో చట్టసభలకు ఎన్నికయ్యే నాయకులు ఎలా పడితే అలా ప్రవర్తించడానికి వీలు లేదని, సభలో సభ్యులు ఎలా ప్రవర్తించాలన్నదానిపై బిజినెస్ రూల్స్ బుక్ ఉంటుందని, ఆ నిబంధనల ప్రకారం అందరూ నడుచుకోవాల్సి ఉంటుందని ఎపి ఎస్‌సి ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకరరావు చెప్పారు. విజయవాడలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చట్టసభలకు ఎన్నికయ్యే నాయకులు ప్రజలకు బాధ్యత వహించాల్సి ఉంటుందని, 2015 డిసెంబర్ 18న అసెంబ్లీలో చోటు చేసుకున్న దురదృష్టకరమైన ఘటనలపై హైకోర్టుకు, సుప్రీంకోర్టు వరకు తిరిగి అసెంబ్లీ పరిధిలోకే వచ్చాయన్నారు. వైసిపి ఎమ్మెల్యే రోజా తన తోటి దళిత మహిళా ఎమ్మెల్యే అనితను దూషిస్తూ మాట్లాడిన పదజాలం, ఆమె బాడీలాంగ్వేజ్ వీటన్నింటినీ గమనించిన స్పీకర్ సభ నుంచి ఒక సంవత్సరం సస్పెండ్ చేశారని గుర్తుచేశారు. దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లగా స్పీకర్‌కే అధికారం ఉంటుందని సుప్రీంకోర్టు తెలిపిందని గుర్తుచేశారు. ‘నేను ఏమీ అనలేదు.. ట్యాంపర్ చేశారు.. నేను ఎందుకు క్షమాపణ చెప్పాలని బుకాయించిన రోజా చివరకు ఏదో విధంగా సభకు రావాలని బేషరతుగా క్షమాపణ చెబుతానని స్పీకర్‌కు లేఖ ఇచ్చి సభకు వచ్చారన్నారు. అనితకు క్షమాపణ చెబితే రెడ్డి పౌరుషం ఏమైనా తగ్గుతుందా.. ఇష్టమొచ్చినట్లు మాట్లాడేసి, అసెంబ్లీలోకి ప్రవేశించి క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదని నవ్వుకుంటున్న రోజా, అనితకు బేషరతుగా క్షమాపణ చెప్పకపోతే సభే సుమోటోగా అట్రాసిటి కేసుగా తీసుకుని కేసును నమోదు చేయాలని జూపూడి అన్నారు.