ఆంధ్రప్రదేశ్‌

ఆ సర్వే సంస్థ చంద్రబాబు కుటుంబ సభ్యులదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 16: చంద్రబాబుపరిపాలన బాగుందని సిఎంఎస్ సర్వే వెల్లడించిన ఫలితాలు బూటకమని, ఈ సర్వే సంస్ధ ముఖ్యమంత్రి చంద్రబాబు బంధువులదని వైకాపా సీనియర్ నేత అంబటి రాంబాబు విమర్శించారు. శనివారం ఆయన ఇక్కడ విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ, చంద్రబాబుకు ప్రత్యామ్నాయం ఆంధ్రప్రదేశ్‌లో లేదని ఈ సర్వే ద్వారా చెప్పించారన్నారు. ఇలా ఒక సర్వే సంస్ధపై వత్తిడి తెచ్చి అంకెలు తారుమారు చేసి వివరాలను మీడియాకు విడుదల చేయడం చంద్రబాబుకు వెన్నతో పుట్టిన విద్య అన్నారు. 2004 ఎన్నికల్లో కూడా ఇదే సంస్ధ చేత చంద్రబాబు ఎన్నికల్లో గెలుస్తారని చెప్పించారన్నారు. కాని ఆ ఎన్నికల్లో టిడిపి ఓటమి చెందారన్నారు. ఈ సర్వే విశ్వసనీయత ఎంటో ప్రజలకు తెలుసన్నారు. ఈ నెల 19వ తేదీనన పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి 13 జిల్లాల పార్టీ అధ్యక్షులతో సమావేశాన్ని నిర్వహించనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో నెలకొన్న కరవు, రైతాంగ సమస్యలు, తాగునీటి ఎద్దడి సమస్యలపై చర్చిస్తామన్నారు. చంద్రబాబు విపక్ష పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేసి కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబుకు దమ్ముంటే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి పోటీ చేయించాలన్నారు.