ఆంధ్రప్రదేశ్‌

ఎన్నికల ఫలితాలపై కమలనాథుల్లో ఉత్సాహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ/విజయవాడ, మార్చి 11: ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించిన నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా బిజెపి శ్రేణులు ఆనందోత్సాహాలు వ్యక్తం చేశాయి. శనివారం ఎన్నికల ఫలితాలు వెల్లడైన వెంటనే ఆ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం వర్ధిల్లాలంటూ పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. జిల్లా కేంద్రం కాకినాడతో పాటు రాజమహేంద్రవరం, అమలాపురం తదితర ప్రాంతాల్లో పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో విజయోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు యెనిమిరెడ్డి మాలకొండయ్య, కాకినాడ నగర అధ్యక్షుడు పెద్దిరెడ్డి రవికిరణ్‌ల ఆధ్వర్యంలో నగరంలోని భానుగుడి జంక్షన్ వద్ద బాణా సంచా వెలిగించి, ప్రజలకు మిఠాయిలు పంచి హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరంలో ఆ పార్టీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ ఆధ్వర్యంలో బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు తదితరులు మిఠాయిలు తినిపించుకుని సంబరాల్లో పాల్గొన్నారు.
బిజెపి పట్ల ప్రజల సంపూర్ణ విశ్వాసం
ప్రధాని నరేంద్రమోదీ సంస్కరణలు, భారతీయ జనతాపార్టీ అవినీతి రహిత పాలన, అభివృద్ధికి ప్రజలు తమ ఓటుతో మద్దతు తెలిపారని ఆ పార్టీ నాయకులు, రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు పేర్కొన్నారు. భారతీయ జనతాపార్టీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం మధ్యాహ్నం విలేఖరుల సమావేశంలో మంత్రి కామినేని మాట్లాడుతూ ఐదు రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల్లో బిజెపికి మెజారిటీ కట్టబెట్టి ప్రజలు ప్రధాని మోదీ పట్ల తమ విశ్వసనీయతను చాటారన్నారు. పెద్దనోట్ల రద్దు వంటి ఆర్థిక సంస్కరణలను విపక్షాలు, కమ్యూనిస్టులు మసిపూసి దుష్ప్రచారం చేసినప్పటికీ ప్రజలు పట్టించుకోలేదన్నారు. పేదలు, మహిళలు, కార్మికులు, యువతకు ఉపయోగపడేలా అంత్యోదయ వికాసం కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుందని, వారే పార్టీకి అఖండ విజయం చేకూర్చారన్నారు. ఐదు రాష్ట్రాలకు జరిగిన శాసనసభ ఎన్నికల్లో విజయఢంకా మోగించిన నేపథ్యంలో పార్టీ ఆంధ్రప్రదేశ్ కార్యాలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జమ్ముల శ్యాంకిషోర్, రాష్ట్ర మైనార్టీ మోర్చా అధ్యక్షుడు ఎస్‌కె బాజి, రాష్ట్ర మహిళా మోర్చ అధ్యక్షురాలు ఎస్.మారతీరాణి, ఎస్‌సి మోర్చా రాష్ట్ర అధ్యక్షులు దారా సాంబయ్య పాల్గొన్నారు.

రాజమహేంద్రవరంలో బిజెపి ఎమ్మెల్యే సత్యనారాయణ ఆధ్వర్యంలో సంబరాలు