రాష్ట్రీయం

విజిలెన్స్ ఇన్‌స్పెక్టర్ బదిలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఏప్రిల్ 18: శ్రీవారి ఆలయంలో ఎలక్ట్రానిక్ పరికరాలు, కెమెరాలు తీసుకెళ్లకూడదన్న నిబంధనలను ఉల్లంఘించి పెన్ కెమెరాతో ఆలయంలోకి వెళ్లిన పరకామణిలో విజిలెన్స్ ఇన్స్‌పెక్టర్‌గా పనిచేస్తున్న వెంకటేష్‌ను మాతృసంస్థకు బదిలీ చేస్తూ టిటిడి ఇ ఓ డాక్టర్ సాంబశివరావు, ఇన్‌చార్జ్ సివిఎస్‌ఓ గోపినాథ్ జెట్టి సోమవారం నిర్ణయం తీసుకున్నారు. వెంకటేష్ అనే విజిలెన్స్ ఇన్స్‌పెక్టర్ శ్రీవారి ఆలయంలో పరకామణిలో విధులు నిర్వహిస్తున్నారు. 4 రోజల క్రితం పెన్‌కెమెరాను జేబులో ఉంచుకొని ఆలయంలోకి ప్రవేశించాడు. ఆలయంలోని పడికావలి సమీపంలో ఈ విషయాన్ని గమనించిన విజిలెన్స్ సిబ్బంది ఈవిషయాన్ని విజి ఓ మల్లికార్జున్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే ఆయన వెంకటేష్‌ను ఆలయం నుంచి వెనక్కి రమ్మని తన కార్యాలయంలో విచారించారు. ఆలయంలోకి కెమెరా తీసుకువెళ్లకూడదన్న నిబంధన ఉల్లంఘించడంపై ప్రశ్నించారు. పొరపాటుగా తాను ఆలయంలోకి తీసుకువెళ్లానని వి ఐ వెంకటేష్ వివరణ ఇచ్చుకున్నారు. అయినప్పటికీ ఆయన్ను మాతృసంస్థలకు బదిలీ చేయాలని టిటిడి యాజమాన్యం నిర్ణయిస్తూ ఆ మేరకు నిర్ణయం తీసుకుంది. వెంకటేష్ ప్రవర్తనపై టిటిడి వర్గాల్లో పలురకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందుకు కారణం ఎస్‌పిఎఫ్ ఎస్‌ఐ గా వెంకటేష్ గతంలో 7వ సెక్టార్‌లో పనిచేశాడు. అటు తరువాత ఆయన్ను పరకామణిలో విధులు నిర్వహించడానికి బదిలీ చేశారు. అలాంటపుడు ఒక విజిలెన్స్ అధికారిగా ఉన్న వ్యక్తి పొరపాటుగా కూడా పెన్ కెమెరాను ఎందుకు తీసుకెళ్లాడు అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా పరకామణిలో విధులు నిర్వహించే టిటిడి సిబ్బంది వారు ఏ హోదాలో ఉన్న వారైనా తమ ఒంటిపై ఆభరణాలు కూడా వేసుకొని వెళ్లకూడదనే నిబంధన అమలు అవుతుంది. అంతేకాకుండా పరకామణిలోకానుకలు లెక్కించడానికి వెళ్లే సమయంలోనే విజిలెన్స్ అధికారులు వారిని క్షుణ్ణంగా తనిఖీచేసి లోపలికి అనుమతిస్తారు. అలా తనిఖీచేసే అధికారే పెన్‌కెమెరాలు తీసుకెళ్లడం, వెనుక ఉన్న కారణాలేమన్న విషయంపై స్పష్టత రావడం లేదు. దేశంలోని ప్రముఖులైన ప్రధాని, రాష్టప్రతి, ముఖ్యమంత్రి ఎవరూ శ్రీవారి దర్శనార్థం వచ్చినా టిటిడికి సంబంధించిన కెమెరామెన్‌లు వెండి వాకిలి వరకే ఫోటోలు తీయడానికి పరిమితమవుతారు. ఈ నిబంధనలు కొన్ని దశాబ్దాలుగా అమలవుతున్నాయి. అలాంటపుడు ఒక పోలీస్‌శాఖ నుంచి టిటిడి విజిలెన్స్ విభాగానికి వచ్చిన అధికారి ఆలయంలోకి పెన్ కెమెరాతో ఎలా ప్రవేశించాడన్నదే కోటి అనుమానాల ప్రశ్నగా మారింది. దీని వెనుక ఉన్న కారణాలను పూర్తిగా విచారించాలని , తద్వారా ఆలయ భద్రతకు భరోసా ఇవ్వాలని భక్తులు కోరుతున్నారు.