ఆంధ్రప్రదేశ్‌

ఇక్కడ మహిళా ఓటర్లే కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, మార్చి 15: కర్నూలు జిల్లా స్థానిక సంస్థల ప్రతినిధిని ఎన్నుకోవడంలో మహిళా ప్రతినిధుల పాత్ర కీలకంగా మారింది. జిల్లాలో ఉన్న స్థానిక సంస్థల్లో వారే అధికంగా ఉండటంతో మహిళల ఓటు ప్రాధాన్యత సంతరించుకోనుంది. జిల్లాలో మొత్తం 1,084 మంది ఓటర్లు ఉండగా నంద్యాల ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి మృతితో ఒక ఓటు తగ్గింది. మిగిలిన 1,083 ఓట్లలో మహిళలు 624 మంది ఉండగా పురుషులు 559 మంది ఉన్నారు. ఆదోని డివిజన్‌లో మహిళా ఓటర్లు 234 మంది, కర్నూలు డివిజన్‌లో 218, నంద్యాల డివిజన్‌లో 172 మంది ఉన్నారు. మొత్తం ఓట్లలో మహిళల శాతం 61. శాసన మండలి ఎన్నికల్లో పోటీ చేస్తున్న తెలుగుదేశం, వైకాపా అభ్యర్థులు శిల్పా చక్రపాణిరెడ్డి, గౌరు వెంకటరెడ్డి ఇప్పటికే అందరినీ కలిసి తమకు ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. సాంకేతికంగా వైకాపాకు స్థానిక సంస్థల్లో మెజారిటీ సభ్యులు ఉన్నా రాజకీయంగా పలు మార్పులు చేర్పుల కారణంగా ఓట్లపై ఏ రాజకీయ పార్టీకి స్పష్టత లేకుండా పోయింది. 2014లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఆత్మ ప్రబోధ ప్రకారం ఓటేయగా ఈసారి వారంతా వైకాపాకు ఓటేయాలని కేంద్ర మాజీమంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. అంతేగాక గత ఎన్నికల్లో టిడిపికి మద్దతిచ్చిన ఆర్పీఎస్ సభ్యులు ఈసారి ఎవరికి ఓటేస్తారో తెలియని పరిస్థితి. గతంలో వైకాపా నుంచి టిడిపిలో చేరిన స్థానిక సంస్థల సభ్యులు ఈసారి మనసు మార్చుకున్నారని వైకాపా నేతలు వెల్లడిస్తున్నారు. వారే కాకుండా నియోజకవర్గ స్థాయి నాయకులు సైతం తిరిగి తమ పార్టీకి మద్దతునివ్వడానికి అంగీకరించడంతో తమ ఓట్ల సంఖ్య గణనీయంగా పెరుగుతుందన్న ధీమాతో ఉన్నారు. నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి విబేధాలను పక్కనపెట్టి శిల్పా చక్రపాణిరెడ్డికి మద్దతునిస్తామని మరణానికి ముందు రోజు ముఖ్యమంత్రి చంద్రబాబుకు హామీ ఇవ్వడంతో తమ వర్గానికి చెందిన వారంతా భూమా ఆఖరి కోరిక తీరుస్తారని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ, కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహనరెడ్డి స్పష్టం చేశారు. దీంతో భూమా వర్గం ఓట్లపై ఉన్న ఆశలను వైకాపా నేతలు వదులుకున్నట్టయింది. శాసనసభలో భూమా సంతాప తీర్మానాన్ని బహిష్కరించిన వైకాపాకు ఎట్టి పరిస్థితుల్లో సహకరించవద్దని ఎమ్మెల్యేలు ఎస్వీ మోహన్‌రెడ్డి, అఖిలప్రియ తమ వర్గం సభ్యులకు సూచించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఇద్దరు వైకాపా ఎమ్మెల్యేలు టిడిపికి సహకరిస్తారన్న ప్రచారం జరుగుతోంది. తాము 200 ఓట్ల మెజారిటీతో విజయం సాధిస్తామన్న ధీమాను టిడిపి నేతలు వ్యక్తం చేస్తున్నారు.