ఆంధ్రప్రదేశ్‌

ఇఎస్‌ఐ ఆస్పత్రుల ద్వారా మెరుగైన వైద్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, మార్చి 19: వచ్చే ఏడాది నాటికి దేశ వ్యాప్తంగా 20 కోట్ల మంది కార్మికులకు ఇఎస్‌ఐ ద్వారా మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని కేంద్ర కార్మిక ఉపాధికల్పన శాఖ సహాయ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. ఆదివారం స్థానిక నూతన ఇఎస్‌ఐ ఆస్పత్రిని ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ నూతన రాష్ట్రంలో 5 ప్రాంతాల్లో రూ.100 కోట్లతో వంద పడకల సూపర్ స్పెషాలిటి ఇఎస్‌ఐ ఆస్పత్రులను చేపడుతున్నామన్నారు.
ఒక్క విశాఖపట్నంలోనే రూ. 500 కోట్ల 500 పడకల ఆస్పత్రిని నిర్మిస్తున్నామన్నారు. కార్మికులు మూడుచోట్ల డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. విజయనగరం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. దేశంలోని అసంఘటిత రంగంలోని 40 కోట్ల మంది కార్మికులను దశలవారీగా భవిష్యనిధి ద్వారా సంఘటిత రంగంలోకి తీసుకువచ్చేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు.