ఆంధ్రప్రదేశ్‌

మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దించి మిర్చి రైతులను ఆదుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, మార్చి 24: ఓ వైపు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక, మరోవైపు తెచ్చిన అప్పులను చెల్లించలేక మిర్చిరైతు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా, ప్రభుత్వానికి కనీసం చీమకుట్టినట్లైనా లేదని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం గుంటూరు మిర్చియార్డును సందర్శించిన జగన్ అక్కడ ఉన్న మిర్చిరైతులతో ముఖాముఖి మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ సాక్షాత్తూ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు హామీ ఇచ్చినా ఇప్పటికీ మార్క్‌ఫెడ్ ద్వారా మిర్చిని కొనుగోలు చేయలేక పోయారని అన్నారు. ధరలు పడిపోయినప్పుడు ప్రభుత్వం మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేసి రైతుకు అండగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. గత ఏడాదితో పోలిస్తే మిర్చి ధర 60 శాతం పడిపోయిందని, రైతులు చెప్తున్నారని, రెండు నెలల క్రితం క్వింటా ధర 12 వేలు ఉండగా ప్రస్తుతం 7 వేలకు పడిపోయిందన్నారు. రుణమాఫీ పేరుతో చంద్రబాబు రైతులను మోసం చేశారని ధ్వజమెత్తారు.