ఆంధ్రప్రదేశ్‌

అసెంబ్లీ సాక్షిగా ప్రజాస్వామ్యం ఖూనీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంగళగిరి, మార్చి 24: తెలుగుదేశం ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్‌రెడ్డి, తదితరులు ఆరోపించారు. అమరావతి అసెంబ్లీ ప్రాంగణం మీడియా పాయింట్‌లో శుక్రవారం శ్రీకాంత్‌రెడ్డితో పాటు వైఎస్‌ఆర్ సీపీ ఎమ్మెల్యేలు నారాయణస్వామి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, కె శ్రీనివాసులు, రాచమల్లు శివప్రసాదరెడ్డి మాట్లాడారు. అగ్రిగోల్డ్ భూముల విషయంలో మంత్రి పుల్లారావుపై చేసిన ఆరోపణలను రుజువు చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి కోరితే మైక్ ఇవ్వని పరిస్థితి దారుణమని , పలుమార్లు మైక్ ఇవ్వమని కోరినా స్పీకర్ పట్టించుకోలేదని, అదే సమయంలో జగన్మోహన్‌రెడ్డిపై నిందలు వేసేవారికి మాత్రం సమయం కేటాయించారని శ్రీకాంత్‌రెడ్డి ఆరోపించారు. హిట్లర్ పుట్టిన ఏప్రిల్ 20వ తేదీనే చంద్రబాబు పుట్టారని, అందుకే ఆయనకు ఈయనకు దగ్గర పోలికలున్నాయని ఆయన అన్నారు. పుల్లారావు చేసిన సవాల్ స్వీకరించడం లేదా క్షమాపణ చెప్పడం చేస్తేనే మైకిస్తామని స్పీకరే చెప్పటం దారుణమన్నారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి మాట్లాడుతూ అగ్రిగోల్డ్ ఆస్తులను మంత్రి కొనుగోలు చేశారని, నకిలీ పాస్‌పుస్తకాలు పుట్టించి కొంతభూమిని వేరొకరికి అమ్మారని, తమవద్ద స్పష్టమైన ఆధారాలున్నాయని, దీన్ని రుజువు చేస్తామని చెబుతుంటే మైకే ఇవ్వటం లేదని ఆయన ఆరోపించారు. 19 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలు చర్చించడానికి ప్రభుత్వం ముందుకు రాకపోవడం బాధాకరమని ఎమ్మెల్యేలు ఐజయ్య, శ్రీనివాసులు, శివరామిరెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. ప్రజా సమస్యలపై ఉద్యమించే నేతలను ఎటువంటి సమాచారం లేకుండా ముందస్తుగా అరెస్ట్ చేసేందుకు తెలుగుదేశం ప్రభుత్వం దుర్మార్గంగా పోలీసులకు నిరంకుశ అధికారాలు ఇచ్చిందని పిడిఎఫ్ ఎమ్మెల్సీలు ఎంవిఎస్ శర్మ, బాలసుబ్రహ్మణ్యం , యండవల్లి శ్రీనివాసులు రెడ్డి ఆరోపించారు. అమరావతి అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాపాయింట్‌లో శుక్రవారం వారు మాట్లాడుతూ శాసనసభకు వచ్చేందుకు పాసులు ఇచ్చి కూడా గేటువద్ద అరెస్ట్ చేస్తున్నారని పేర్కొన్నారు.