ఆంధ్రప్రదేశ్‌

కొన్నది వాస్తవమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(బెంజిసర్కిల్), మార్చి 24: ప్రతిపక్ష నేత జగన్ ఆరోపిస్తున్నట్లు అగ్రిగోల్డు డైరెక్టర్ దినకర్ దగ్గర ఆస్తులు కొనుగోలు చేసింది వాస్తవమేనని, అయితే వాటిని న్యాయబద్ధంగా కొనుగోలు చేశామని ఇందులో ఎవరిని భయపెట్టలేదని వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు స్పష్టం చేశారు. శుక్రవారం నగరంలోని సిఎం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లును ఆయన ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన కుటుంబాన్ని రోడ్డుకీడ్చేందుకు జగన్ అండ్ కో గత మూడు సంవత్సరాలుగా ప్రయత్నిస్తూనే ఉందని, ఇప్పటికీ వారు కోరిన ఏ విచారణకైనా ప్రభుత్వం సిద్ధంగానే ఉందన్నారు. అగ్రిగోల్డు అస్తుల వేలం విషయం కోర్టు పరిధిలో ఉందని, కోర్డు ఆదేశాల మేరకు బాధితులందరికీ సమాన న్యాయం చేస్తామన్నారు. అగ్రిగోల్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దినకర్ దగ్గర అస్తులు కొన్న విషయం వాస్తవమేనని, అయితే ఆయన అగ్రిగోల్డుకు సంబంధించి షేర్ హోల్డర్, ప్రమోటర్ కూడా కాదని, ఆయనకు అగ్రిగోల్డు ఆస్తులకు సంబంధం లేదన్నారు. అగ్రిగోల్డు ఆస్తుల్లోని చిన్న చిన్న వాటిని వేలం వేసి బాధితులకు మందుగా పంచాలని కోర్టు సూచించిందని, దీనిలో భాగంగానే ఇంకా హాయ్‌లాండ్‌ను వేలం వేయలేదన్న ఆయన, యారాడ భూములు ప్రభుత్వానికి సంబంధించినవని కోర్టు తేల్చిన విషయం జగన్‌కు తెలియదా అని ప్రశ్నించారు. నకిలీ పత్రాలను సృష్టించడం వైకాపా నేతలకు కొత్త కాదని తప్పుడు పత్రాలతో శాసన సభా గౌరవానికి భంగం కలిగిస్తున్నారన్నారు. 11 కేసుల్లో ముద్దాయిగా ఉన్న జగన్ 16 నెలల పాటు జైలు జీవితం అనుభవించాడని, ప్రజాస్వామ్య ముసుగులో నేడు అరాచకాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. విలేఖరుల సమావేశంలో వినుకొండ ఎమ్మెల్యే జివి ఆంజనేయులు మాట్లాడుతూ అగ్రిగోల్డు ఆస్తులను వైకాపా నేత గౌతం రెడ్డి కొనలేదా అని ప్రశ్నించారు.