ఆంధ్రప్రదేశ్‌

టిడిపి - వైసిపి మైండ్‌గేమ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, మార్చి 24: ప్రధాన ప్రతిపక్షనేత నుంచి క్షమాపణ లేదా విచారణకు అంగీకరించే అంశంపై విధించిన సవాల్‌పై శాసనసభలో ఉదయం నుంచి సాయంత్రం వరకూ జరిగిన వ్యవహారమంతా ఒకరిపై మరొకరు పట్టు సాధించుకునే పొలిటికల్ మైండ్‌గేమ్‌ను తలపించింది. ఎవరికెంత మైలేజీ వస్తుందన్న దానిపైనే ఇరు పార్టీల వ్యూహాలు రెండురోజులు కొనసాగాయి. ఈ అంశంలో ఫలితం ఏమీ తేలకపోగా, ప్రతిపక్షానికి బయట మీడియా, అధికారపార్టీకి లోపల సభ వేదికగా మారింది.
అగ్రిగోల్డ్ భూములను మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తన భార్య పేరుతో కొనుగోలు చేశారంటూ గురువారం నాటి సభలో వైసీపీ అధినేత, ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి చేసిన ఆరోపణలను నిరూపించాలని, లేకపోతే ఆయనను సభ నుంచి వెలివేయాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి తెదేపా, బిజెపి సభ్యుల వరకూ స్పీకర్‌ను కోరారు. జగన్ తన వద్ద ఉన్న ఆధారాలను రుజువుచేయాలని, అందులో తాను అగ్రిగోల్డ్ భూములు కొన్నట్టు రుజువయితే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని, లేకపోతే జగన్ రాజీనామా చేస్తారా? అని పుల్లారావు గురు, శుక్రవారాలు సభలో సవాల్ చేశారు.
అయితే, జగన్ దానికి నిన్న, నేడు కూడా నేరుగా సమాధానం చెప్పలేదు. అగ్రిగోల్డ్ బాధితుల సమస్య పక్కదారి పట్టించేందుకే ప్రభుత్వం, ఈ సవాళ్లను తెరమీదకు తెచ్చిందని, దానిపై న్యాయవిచారణ జరిపించాలన్న డిమాండును తెరపైకి తెచ్చి, అసలు జవాబు దాటవేయడంతో గురువారం వరకూ జగన్ వద్ద జవాబు లేదని, ఆయన ఆ విషయంలో భయపడుతున్నారన్న అభిప్రాయమే ఏర్పడింది.
జగన్ కోరుతున్నట్లు న్యాయవిచారణకు ప్రభుత్వం సిద్ధంగానే ఉందని, అయితే అందులో పుల్లారావు నిర్దోషిత్వం రుజువైతే జగన్ రాజీనామా చేసి, క్షమాపణ చెబుతారా? అని అచ్చెన్నాయుడు సహా మంత్రులంతా ముక్తకంఠంతో ప్రశ్నించారు.
దాంతో వ్యూహం మార్చిన జగన్ అసెంబ్లీ గేటు బయట మీడియాతో అగ్రిగోల్డ్ వ్యవహారాలు మాట్లాడుతూనే, స్పీకర్‌పై గతంలో తన సొంత మీడియా సంస్థలో వచ్చిన క్లిప్పింగులను సభలో ప్రదర్శంచిన వైనాన్ని కూడా తప్పు పట్టారు. ఆ సందర్భంగా గతంలో జరిగిన ఓటుకునోటు అంశాన్ని మళ్లీ తెరపైకి తీసుకువచ్చారు. ఉదయం సభలో తనకు 20 నిమిషాలు సమయం ఇస్తే అగ్రిగోల్డ్‌కు సంబంధించిన వాస్తవాలు వెల్లడిస్తానని జగన్ చెప్పినా స్పీకర్, అధికారపార్టీ సభ్యులు అంగీకరించలేదు. చివరకు సీఎం చంద్రబాబు కూడా సభలో పుల్లారావు, జగన్ ఎవరో ఒకరే ఉండాలని అన్నారు. స్పీకర్ కోడెల సభను బెదిరించడం మంచిది కాదని జగన్ వ్యాఖ్యానించగా, యనమల కూడా జగన్ వ్యవహారశైలికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అయినా పట్టించుకోని జగన్ తన సభ్యులతో బయటకు వెళ్లిపోయారు.
జనవరి 5న అగ్రిగోల్డ్ వ్యవహారంలో పోలీసు దాడులు జరిగితే, 19న మంత్రి తన భార్య పేరుతో దినకరన్ వద్ద భూమి కొన్నారని చెబుతూ వాటికి సంబంధించిన సేల్‌డీడ్, లింక్‌డాక్యుమెంట్, ఇసిలను చూపించారు.