ఆంధ్రప్రదేశ్‌

కాకినాడలో లాజిస్టిక్ వర్శిటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 26: పారిశ్రామిక రంగానికి మరింత ఊతమిచ్చేందుకు వీలుగా కాకినాడలో లాజిస్టిక్ వర్శిటీ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన బిల్లు అసెంబ్లీ ఆమోదించడంతో వర్శిటీ నిర్మాణ ప్రక్రియ జోరందుకుంది. వస్తువులు, సేవల పన్ను, అంతర్ మోడల్ రవాణా, పారిశ్రామిక రంగంలో గణనీయమైన వృద్ధి సాధించేందుకు ఈ వర్శిటీ దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రపంచంలోనే లాజిస్టిక్ రంగంలో దేశాన్ని కీలక స్థానంగా తీర్చిదిద్దాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృతనిశ్చయంతో ఉన్నాయి. ఈ రంగంలో కొత్త ఆవిష్కరణలకు, పరిశోధనలకు ఊతమిచ్చేలా వర్శిటీ సేవలు దోహదపడతాయి. రోడ్డు, రైలు, విమానాలు, గిడ్డంగులు, అంతర్జాతీయ వ్యాపారం వంటి వాటిలో లాజిస్టిక్స్ కీలకం కానున్నాయి. లాజిస్టిక్స్, పంపిణీ వ్యవస్థ ఇంతకాలం నిర్లక్ష్యానికి గురైనప్పటికీ ప్రపంచీకరణ నేపథ్యంలో ఈ పరిశ్రమ స్వరూపం మారి, అనేక మార్గాలను తెరిచింది. 2014లో దేశంలో లాజిస్టిక్ పరిశ్రమ వ్యాపారం 182 బిలియన్ డాలర్లని అంచనా వేయగా, 2020 నాటికి 12.17 శాతం మేర పెరుగుతుందని అంచనా. ఈ రంగంలో నిపుణుల సంఖ్య కూడా 2022 నాటికి 17 మిలియన్లు ఉంటుందని భావిస్తున్నారు. లాజిస్టిక్స్ రంగంలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకునేందుకు వీలుగా రాష్ట్రంలో లాజిస్టిక్స్ వర్శిటీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ వర్శిటీ ఏర్పాటుకు ఇప్పటికే భూమిని గుర్తించింది. మూలధనంతో సహా దాదాపు 350 కోట్ల రూపాయల వ్యయంతో ఈ వర్శిటీని నిర్మించనున్నారు. అకడమిక్ బ్లాక్‌ల నిర్మాణానికి 26.6 కోట్ల రూపాయలు, పరిశోధన, వౌలిక సదుపాయాల కల్పనకు 32 కోట్లు, హాస్టళ్లకు 45 కోట్లు, ఫ్యాకల్టీ వసతికి 32.4 కోట్లు, భోజనశాలలకు 7.9 కోట్లు, పరిపాలనా బ్లాక్‌కు 5 కోట్లు, ఆడిటోరియం నిర్మాణానికి 3.75 కోట్లు, ఇతర అవసరాలకు దాదాపు 18 కోట్ల రూపాయలు వెచ్చించనున్నారు. మొదటి రెండేళ్లకు వరుసగా 21.5 కోట్లు, 36.7 కోట్ల రూపాయలు కేటాయించాలని ప్రతిపాదించారు.