రాష్ట్రీయం

శుక్ర, శని, ఆదివారాల్లో ప్రొటోకాల్ విఐపి దర్శనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, మార్చి 27: వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని సామాన్య భక్తులకు దర్శన సమయాన్ని ఎక్కువగా కేటాయించడంలో భాగంగా వారాంతంలో ప్రొటోకాల్ ప్రముఖులకు మాత్రమే విఐపి బ్రేక్ దర్శన సౌకర్యం కల్పించాలని నిర్ణయించినట్లు టిటిడి ఇఓ సాంబశివరావు వెల్లడించారు. సోమవారం అన్నమయ్య భవనంలో జరిగిన ధర్మకర్తల మండలి సమావేశం అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ వేసవి సెలవుల నేపధ్యంలో శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే సామాన్య భక్తుల రద్దీ గణనీయంగా పెరుగుతుందన్నారు. ఈక్రమంలో విఐపి దర్శనాలకు ఎక్కువ సమయం కేటాయిస్తే సామాన్య భక్తులు ఇబ్బందిపడే అవకాశం ఉందన్నారు. అందుకే విఐపి దర్శనాలను క్రమబద్ధీకరించడంలో భాగంగా శుక్ర, శని, ఆదివారాల్లో ప్రొటోకాల్ విఐపిలకు మాత్రమే దర్శన సౌకర్యం కల్పించాలని నిర్ణయించామన్నారు. ఈ నేపధ్యంలో ఎలాంటి సిఫార్సు ఉత్తరాలను కూడా బ్రేక్ దర్శనాలకు అనుమతించబోమని స్పష్టం చేశారు. సోమ, మంగళ, బుధ, గురు వారాల్లో ఎల్-2, ఎల్-3 దర్శనాలను మాత్రమే కల్పిస్తామన్నారు. ఈ నిబంధనలను ఏప్రిల్ 7 నుంచి 10 వారాలు అమల్లో ఉంటాయని, ప్రముఖుల సహకరించాలని ఇఓ వివరించారు.
తిరుమలలో వకుళాదేవి విశ్రాంతి గృహ నిర్మాణం
శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తుల సౌకర్యార్థం తిరుమలలో వకుళాదేవి విశ్రాంతి గృహం నిర్మాణానికి టిటిడి బోర్డు అంగీకరించిందని బోర్డు చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి చెప్పారు. తిరుమల అన్నమయ్య భవన్‌లో సోమవారం టిటిడి బోర్డు సమావేశం జరిగింది. అనంతరం ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను చైర్మన్ చదలవాడ, ఇఓ సాంబశివరావు విలేఖరులకు వివరించారు. 39కోట్ల రూపాయల వ్యయంతో తిరుమలలో మాతృశ్రీ వకుళాదేవి పేరుతో విశ్రాంతి గృహాన్ని నిర్మించేందుకు నిధులు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. టిటిడికి సంబంధించి అభివృద్ధి, నిత్యావసర వస్తువులకు సంబంధించి రూ. 86 కోట్లకు సంబంధించిన పనులకు, కొనుగోళ్లకు బోర్డు ఆమోదముద్ర వేసిందన్నారు.