ఆంధ్రప్రదేశ్‌

ఫిరాయింపులపై మరోసారి ఫిర్యాదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, మార్చి 27: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు, తమ పార్టీ బి ఫారంపై గెలిచిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించకుండానే వారిలో కొందరికి మంత్రి పదవులిచ్చేందుకు తెలుగుదేశం పార్టీ చేస్తున్న ప్రయత్నాలను మరోసారి అడ్డుకోవాలని వైఎస్సార్‌సీపీ నిర్ణయించినట్లు సమాచారం. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణపై చంద్రబాబునాయుడు కసరత్తు చేసే సమయానికి ముందే, గవర్నర్‌ను కలవాలని వైసీపీ అధినేత జగన్ యోచిస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం.తెదేపాలో చేరిన భూమా అఖిలప్రియ, అమర్‌నాథ్‌రెడ్డి, జ్యోతుల నెహ్రుకి మంత్రి పదవులిచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారన్న వార్తలు వెలువడుతున్న విషయం తెలిసిందే. దీని ద్వారా తెదేపాను రాజకీయంగా, నైతికంగా మరోసారి ఇరుకున పెట్టే వ్యూహానికి వైసీపీ పదునుపెడుతోంది. తమ పార్టీ బీ ఫారం ద్వారా గెలిచిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించకుండా, వారికి మంత్రి పదవులివ్వడం అనైతికమని, ఈ విషయంలో గవర్నర్ రాజ్యాంగ విలువలతోపాటు, నైతిక విలువలనూ పరిగణనలోకి తీసుకోవాలని కోరనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో సనత్‌నగర్ తెలుగుదేశం ఎమ్మెల్యేగా గెలిచిన తలసాని శ్రీనివాసయాదవ్‌తో రాజీనామా చేయించకుండానే, ఆయనను కేసీఆర్ మంత్రివర్గంలోకి ఎలా తీసుకుంటారంటూ టిడిపి నేత రేవంత్, ఇతర ఎమ్మెల్యేలు గవర్నర్‌కు ఫిర్యాదు చేయపంతోపాటు, ఆయన నిర్ణయాన్ని తప్పుపట్టిన వైనాన్ని ఈ సందర్భంగా మరోసారి గుర్తు చేయాలని నిర్ణయించుకున్నారు. తలసానికి మంత్రి పదవి ఇచ్చిన తర్వాత తెలంగాణ టిడిపి నేతలు చేసిన ఫిర్యాదుతోపాటు, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సందర్భంలో చంద్రబాబునాయుడు ఆయనపై చేసిన విమర్శలకు సంబంధించిన క్లిప్పింగులను కూడా తమ ఫిర్యాదులో పేర్కొనాలని నిర్ణయించారు. విజయవాడలో ఐపిఎస్ అధికారి బాలసుబ్రహ్మణ్యం, ఆయన గన్‌మెన్‌పై తెదేపా ఎంపి కేశినేని, ఎమ్మెల్యే బోండా ఉమ, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తదితరులు చేసిన దాడిని కూడా గవర్నర్ దృష్టికి తీసుకురావాలని నిర్ణయించుక్నునట్లు తెలుస్తోంది. బాలసుబ్రహ్మణ్యంతోపాటు, ఉద్యోగ సంఘాలు చేసిన ఆరోపణలు, వ్యాఖ్యలను కూడా తమ వాదనకు మద్దతుగా వినిపించేందుకు సిద్ధమవుతున్నారు.