ఆంధ్రప్రదేశ్‌

పట్టు బిగిస్తున్న ప్రతిపక్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, మార్చి 27: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సభలో పట్టుసాధించేందుకు కసరత్తు చేస్తున్నారు. గతంలో హైదరాబాద్‌లో జరిగిన సమావేశాలకు, ప్రస్తుతం నవ్యాంధ్రలో సొంత గడ్డపై జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలకు జగన్ మాట్లాడుతున్న తీరు పరిశీలిస్తే, విపక్ష నేత రాటుదేలుతున్నారన్న విషయం స్పష్టమవుతోంది. శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రజాసమస్యలు, అంశాలపై కాకుండా అధికార-ప్రతిపక్షపార్టీ మధ్య ఆధిపత్యపోరుకు వేదికగా మారుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. మునె్నన్నడూ జరగని తీరు, సంప్రదాయాలు ఈ బడ్జెట్ సమావేశాల్లోనే మొదలయ్యాయి.
తెలంగాణ అసెంబ్లీలో కేసీఆర్ గతంలో సాగునీటి ప్రాజెక్టులపై సభలో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి, కొత్త సంప్రదాయానికి తెరలేపగా, ఏపి అసెంబ్లీలో జాతీయ మహిళా పార్లమెంటు సదస్సులో తాను చేయని వ్యాఖ్యలను చేసినట్లు జగన్ మీడియా చేసిన ఆరోపణలలో వాస్తవాలు ప్రజలకు ప్రజాప్రతినిధుల ద్వారా వెల్లడించేందుకు, నాటి కోడెల మీట్ ది ప్రెస్ వీడియో క్లిప్పింగును సభలో ప్రదర్శించారు. ఏపికి సంబంధించినంత వరకూ సభ బయట జరిగిన విషయాలను సభలో ప్రదర్శించడం ఇదే తొలిసారి. తర్వాత మళ్లీ తాజాగా పోలవరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. సభలో-బయట ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ ఈ రెండు అంశాలపై తరచూ చేస్తున్న ఆరోపణలు, విమర్శలను తిప్పికొట్టేందుకు ప్రభుత్వం ఈ ప్రక్రియను ఎంచుకోవడం ద్వారా, జగన్ పార్టీ చేస్తున్న ఆరోపణల్లో పస లేదన్న విషయాన్ని ప్రజలకు చెప్పడంలో తెలుగుదేశం ప్రభుత్వం విజయం సాధించింది. అయితే, ప్రతిపక్షనేత జగన్ ఈ విషయంలో సభలో ప్రభుత్వ వ్యూహాన్ని ఎదుర్కొని తిప్పికొట్టే అవకాశం లేకపోవడంతో, దాన్ని తరచూ మీడియా ద్వారా ప్రజలకు వెల్లడించే ప్రతి వ్యూహాన్ని కొనసాగిస్తూ తన వాదనలను వినిపించడంలో విజయం సాధిస్తున్నారు. హైదరాబాద్‌లో జరిగిన సమావేశాల్లో మీడియాతో పెద్దగా భేటీ కాని జగన్, అమరావతిలో మాత్రం దాదాపు ప్రతిరోజూ మీడియాలో ఉండే వ్యూహాన్ని కొనసాగిస్తున్నారు. సభ వాయిదా పడిన మధ్యలో, సభ ముగిసిన సమయంలో మీడియాతో పిచ్చాపాటీ మాట్లాడుతూ చెప్పాల్సినవి చెబుతున్నారు. ప్రధానంగా సాగు-తాగు నీరు, విద్యుత్ అంశాలపై ఆయన లేవనెత్తుతున్న అభ్యంతరాలు, చేస్తున్న విమర్శలు పరిశీలిస్తే జగన్ సభకు వచ్చే ముందు అన్ని అంశాలపై సుదీర్ఘ కసరత్తు చేస్తున్నారన్న విషయం స్పష్టమవుతోంది. నిజానికి, రాష్ట్రంలో ఆ రెండు అంశాలపై ఇప్పటివరకూ సంపూర్ణ విషయ పరిజ్ఞానం ఉన్న ఏకైక నాయకుడు చంద్రబాబునాయుడు మాత్రమే. ఇరిగేషన్-పవర్ అంశాల్లో బాబు దస్త్రాలు చూడకుండా వాటి వివరాలను కూలంకషంగా చెబుతుంటారు. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష నేత జగన్ అదే రెండు అంశాలపై పూర్తి సమాచారాన్ని దస్త్రాలతో సహా చూపిస్తూ ప్రభుత్వాన్ని ఇరికించేలా గళమెత్తుతున్నారు. తాజాగా విజయవాడలో ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్, సీనియర్ ఐపిఎస్ అధికారి బాలసుబ్రమణ్యంపై తెదేపా ఎంపి కేశినేని నాని, ఎమ్మెల్యే బోండా ఉమ, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న చేసిన దాడితో అధికారపార్టీ రాజకీయంగా ఇబ్బందిపడిన పరిస్థితిని సొమ్ము చేసుకోవడంలో, జగన్ సఫలమయ్యారని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. కృష్ణాజిల్లా నందిగామ వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో పదిమంది చనిపోయిన ఘటనలో తనతోపాటు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలపై పెట్టిన కేసులను.. తాజాగా ఐపిఎస్ అధికారి గన్‌మెన్‌పై చేయిచేసుకున్నా కేసు పెట్టని ప్రభుత్వ పక్షపాతాన్ని జనంలోకి పంపించడంలో జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరించారు.