ఆంధ్రప్రదేశ్‌

ఫిన్‌టెక్ వ్యాలీకి మరో దిగ్గజం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, మార్చి 28: విశాఖ ఫిన్‌టెక్ వ్యాలీకి అంతర్జాతీయ డిజిటల్ దిగ్గజాలను తీసుకురావడంలో ఆంధ్ర ప్రభుత్వానికి సహాయ సహకారాలు అందిస్తామని ఐటీ రంగ ప్రముఖ పారిశ్రామికవేత్త, ఏఎన్‌ఎస్‌ఆర్ గ్రూప్ చైర్మన్ లలిత్ అహూజా చెప్పారు. బుధవారం సాయంత్రం శాసనసభ కార్యాలయంలో సిఎం చంద్రబాబుతో సమావేశమైన లలిత్ అహూజా, విశాఖ ఫిన్‌టెక్ వ్యాలీలో రూ.వెయ్యి కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. దీనిద్వారా వచ్చే నాలుగేళ్లలో 10 వేల ఉద్యోగాల కల్పన జరుగుతుందన్నారు. ఆర్థిక సాంకేతిక రంగంలో ప్రపంచశ్రేణి సంస్థలను విశాఖకు తెచ్చేందుకు కృషి చేస్తామని అహూ జా వెల్లడించారు. ఇప్పటికే అమెరికాలోని ఓ ప్రసిద్ధ విశ్వవిద్యాలయం ఫిన్‌టెక్ వ్యాలీలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు అంగీకారం తెలిపిందన్నారు. పేరొందిన ఫిన్‌టెక్ సంస్థలను రాష్ట్రానికి రప్పించేందుకు తాము ముఖ్య భూమిక పోషిస్తామన్నారు. విశాఖ ఫిన్‌టెక్ వ్యాలీ కేంద్రంగా రానున్న కాలానికి అవసరమయ్యే సాంకేతిక విద్యావసరాలను తీర్చడానికి కృషి చేస్తున్నామని సిఎం చంద్రబాబు అన్నారు. ఇప్పటికే ఫిన్‌టెక్ వ్యాలీ పలు పేరొందిన సంస్థలతో అలరారుతోందని, ఏఎన్‌ఎస్‌ఆర్ గ్రూప్ ప్రవేశంతో దాని ఖ్యాతి మరింత ఇనుమడిస్తోందన్నారు. మరో నెల రోజుల్లో విశాఖలో తమ కార్యకలాపాలు ప్రారంభిస్తామని అహూజా ముఖ్యమంత్రికి వివరించారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ఐటీ సలహాదారు జెఏ చౌదరి, సిఎం ముఖ్య కార్యదర్శి సాయిప్రసాద్, ఐటీ ముఖ్య కార్యదర్శి విజయానంద్, సిఎం అదనపు కార్యదర్శి ప్రద్యుమ్న పాల్గొన్నారు.

చిత్రం..సిఎంను కలిసిన ఎఎన్‌ఎస్‌ఆర్ గ్రూపు చైర్మన్ లలిత్ అహూజా, తదితరులు