ఆంధ్రప్రదేశ్‌

లీకేజి వార్తల్లో వాస్తవం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 28: పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజీ అంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని ఏపీ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ప్రతిపక్ష పార్టీ ప్రశ్నపత్రాల లీకేజి పేరుతో దుష్ప్రచారం చేస్తోందంటూ ఆయన మండి పడ్డారు. పరీక్ష జరగక ముందే ప్రశ్నపత్రం బయటకు వస్తే దాన్ని లీకేజి అంటారని చెప్పారు. నెల్లూరులో ఒక పరీక్ష కేంద్రంలో అటెండర్ పరీక్ష పత్రాన్ని మొబైల్ నుంచి ఫొటోలు తీసి వాట్సాప్ ద్వారా బయటకు పంపించినట్టు వార్తలు వచ్చినట్టు వెల్లడించారు. ఈ వ్యవహారంపై వెంటనే విచారణకు ఆదేశించినట్టు ఆయన పేర్కొన్నారు. లీకేజీ జరిగిందని తేలితే, ఎంతటివారైనా చర్యలు తీసుకోవడానికి వెనకడుగు వేసేది లేదన్నారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అన్ని చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులను మంత్రి గంటా శ్రీనివాస్ కలిశారు. విభజన చట్టం ప్రకారం రాష్ట్రంలో ఏర్పాటు చేయాల్సిన విద్యాసంస్థల స్థాపన పనులను వేగవంతం చేయాలని కేంద్ర మంత్రులను విజ్ఞప్తి చేసినట్టు చెప్పారు. ఇప్పటికే ఏపికి ఐదు యూనివర్శిటీలను ఏర్పాటు చేసిన కేంద్రం మరో రెండు యూనివర్శిటీలు ముఖ్యంగా గిరిజన విశ్వవిద్యాలయం, కేంద్రీయ విద్యాలయం బిల్లులు ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లోనే ఆమోదం పొందుతాయనే నమ్మకం ఉందన్నారు.