ఆంధ్రప్రదేశ్‌

ఎన్టీఆర్ నుంచి.. లోకేష్ వరకూ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, మార్చి 28: కొత్త వారసుడు లోకేష్ చట్టసభలోకి అడుగుపెడుతున్న సందర్భంలో ఆవిర్భావ దినోత్సవ సంబరాలు చేసుకుంటున్న తెలుగుదేశం పార్టీ, తన ముందున్న భారీ లక్ష్యాలను పూర్తి చేసుకునేందుకు రాజకీయ అవరోధాలు ఎదుర్కొనే పనిలో ఉంది. నిజానికి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ నుంచి ఇప్పటి అధినేత, చంద్రబాబునాయుడు వరకూ అధికారంలో లేకున్నా, ఉన్నా రాజకీయ ప్రత్యర్థులను ఎదుర్కోవడంతోనే సమయం సరిపోతోంది. నందమూరి తరం స్థానంలో వచ్చిన నారా తరంతో పార్టీకి ఫక్తు రాజకీయ కళ వచ్చింది. ఎన్టీఆర్‌ను మర్చిపోయేలా చేసి, పార్టీపై తన ముద్ర వేసేందుకు బాబు చాలా శ్రమించాల్సి వచ్చింది. ఒకప్పుడు ఎన్టీఆర్ మాట పార్టీకి అనివార్యం కాగా, ఇప్పుడు బాబు ఇమేజీ మీదే పార్టీ ఆధారపడి మనుగడ సాగిస్తోంది. బాబు తనయుడు లోకేష్ ఇప్పుడు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, భవిష్యత్తులో అధ్యక్షుడయినా బాబు ఇమేజ్ మీదనే ఆధారపడక తప్పదు. రాజకీయ అనుభవం లేకపోవడం, పక్కన సరైన సలహాదారులు లేకపోవడం, కార్పొరేట్ ఆలోచన, కార్పొరేట్ల అలవాట్లు, అసహనం, పొగడ్తలకు పొంగిపోవడం, టెక్నాలజీ మీదే ఎక్కువ ఆధారపడటం, సొంత సామాజికవర్గంపై మమకారం వంటి మైనస్ పాయింట్లను అధిగమిస్తేనే, లోకేష్ స్థాయి ఏమిటన్నదానిపై ఒక స్పష్టత, అంచనా ఏర్పడుతుంది. ఎందుకంటే తాత, తండ్రి ఎంతో కష్టపడితే గానీ ఈ స్థాయికి రాలేకపోయారు. అలాంటి కష్టాలు తెలియకుండా సుకుమారంగా పెరిగిన చినబాబు, మున్ముందు రాజకీయ సవాళ్లను సొంతంగానే ఎదుర్కోవలసి ఉంటుంది. పార్టీ ఆవిర్భావం నుంచి ఎన్టీఆర్ మృతి వరకూ ఒక శకమైతే, బాబు పగ్గాలు తీసుకున్న నాటి నుంచి ఇప్పటివరకూ మరో శకంగా చెప్పాలి. పార్టీని జాతీయ స్థాయిలోకి తీసుకువెళ్లేందుకు కష్టపడిన బాబు ఇమేజ్‌కి తగిన గుర్తింపు లభించింది. హేమాహేమీలతో బాబు అనుబంధం ఆయనను జాతీయ నేతగా నిలబెట్టింది. ఆ స్థాయికి చేరుకునేందుకు కొత్త వారసుడు లోకేష్ చాలా కష్టపడాల్సి వస్తుంది. ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి బాబు అధికారంలో కొనసాగుతున్న ఇప్పటివరకూ రాష్ట్రంలో గట్టి ప్రతిపక్షమే ఉంది. గతంలో కాంగ్రెస్, ఇప్పుడు వైసీపీని ఎదుర్కోవడంతోనే దృష్టి కేంద్రీకరించాల్సి వచ్చింది. ప్రతిపక్ష నేత జగన్ గట్టి సవాలే విసురుతున్నారు.
కాగా, అమరావతి నగర నిర్మాణం తెదేపా భవిష్యత్తుకు సవాల్‌గా నిలిచింది. బాబు వస్తేనే కొత్త రాజధానిని బ్రహ్మాండంగా నిర్మిస్తారన్న నమ్మకం, బాబు వస్తే జాబు వస్తుందన్న నమ్మకాన్ని నిలబెట్టుకోవడం కూడా బాబు సత్తాకు సవాల్‌గా పరిణమించింది. ఇప్పటివరకూ ఒక్క ఇటుక కూడా పేర్చలేదన్న విపక్షాల విమర్శలకు త్వరగా తెరదించకపోతే తెదేపాకు రాజకీయంగా ఎదురుదెబ్బలు తప్పవు. బాబు అధికారంలోకి వచ్చిన మూడో దఫా గతంలో ఎన్నడూ లేనన్ని అవినీతి ఆరోపణలు, మంత్రులపై కుంభకోణాల మచ్చలు పెరగడం పార్టీ శ్రేణులను ఆందోళనకు గురిచేస్తోంది. అదేవిధంగా ఇతర పార్టీల నుంచి ఫిరాయింపులను ప్రోత్సహించడం కూడా రుచించడం లేదు. ప్రధానంగా నారాయణ కాలేజీపై గత కొన్ని నెలల నుంచీ ఆరోపణలు వస్తున్నా పట్టించుకోకపోవడం బట్టి, కార్పొరేట్ల కొమ్ముకాస్తున్నారన్న విమర్శను నిజం చేసుకునే పరిస్థితి వచ్చిందంటున్నారు.
ఇక బాబు గత విధానాలకు విరుద్ధంగా నవ్యాంధ్రలో నెలకొన్న కుల, రాజకీయ సమీకరణకు ప్రాధాన్యం ఇస్తుండటం కొత్త పరిణామం. కాపు కార్పొరేషన్, బ్రాహ్మణ కార్పొరేషన్‌తోపాటు, బీసీ సంక్షేమానికి పెద్దపీట వేస్తూ దాదాపు అన్ని కులాల వారినీ దరి చేర్చుకునే, కుల రాజకీయాలకు తొలిసారిగా తెరతీయడం కనిపిస్తోంది. అదే సమయంలో గత ఏడాది నుంచి కోస్తా జిల్లాల్లో కమ్మ సామాజికవర్గం దూకుడు పెరుగుతోందని, దానితో మిగిలిన వర్గాలు దూరమవుతున్నాయన్న ఆందోళన పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. కీలకమైన పోస్టింగులు, నియామకాల్లో సొంత సామాజికవర్గానికి పెద్దపీట వేస్తున్నారన్న అసంతృప్తి మిగిలిన వర్గాల్లో పెరుగుతుండటం ప్రమాదకర సంకేతాలంటున్నారు. బాబు గతంలో తొమ్మిదేళ్లు సీఎంగా చేసిన కాలంలో ఏనాడూ ఈ ధోరణి కనిపించలేదని, ఇప్పుడు కొత్తగా ఇలాంటి విమర్శలు రావడం పార్టీ భవిష్యత్తుకు మంచిది కాదంటున్నారు. గతంలో పార్టీకి ఉన్న బీసీ ముద్ర స్థానంలో ‘సొంత వర్గ ముద్ర’ పడితే, దానిని విపక్షాలు సొమ్ము చేసుకుంటాయన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి. ఈ సందర్భంగా బిజెపితో బాబు డేంజర్‌గేమ్ ఆడుతున్నారన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో బిజెపిని, ఆ పార్టీలో ఎదుగుతున్న ప్రముఖ వ్యక్తులను, కేంద్రంలో ఉన్న కీలక శక్తి సహకారంతో అణచివేస్తున్నారన్న భావన ఆ పార్టీలో నెలకొంది.