ఆంధ్రప్రదేశ్‌

చిక్కుముడి వీడేదెలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, మార్చి 29: వచ్చే ఏడాది ఖరీఫ్‌కు సాగునీరు అందించాలనే లక్ష్యంతో తూర్పు గోదావరి జిల్లాలో ప్రభుత్వం చేపట్టిన పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం చిక్కుముడి ఎలా వీడుతుందో అర్థంకాని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే అధికారులు పనులు ప్రారంభించినా, పరిహారం చెల్లించిన అనంతరమే భూముల్లో అడుగుపెట్టాలని ఇటీవల హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులతో భూములు కోల్పో యే రైతుల్లో ఉత్సాహం వచ్చింది. ప్రస్తుతం జరుగుతున్న పైపులైను పనులను అడ్డుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే.. అఖండ గోదావరి నది ఎడమ గట్టుపై సీతానగరం మండలం పురుషోత్తపట్నం వద్ద చేపట్టిన ఎత్తిపోతల పథకం పనులు కేవలం తొమ్మిది నెలల్లోనే పూర్తి చేయాలనే సంకల్పంతో అధికారులు ముందుకు వెళుతున్నారు. పనులు చేపట్టి దాదాపు మూడు నెలలు కావొస్తున్నా ఇంకా భూసేకరణ కొలిక్కి రాలేదు. భూమి లేకుండానే పనులు చేసేస్తున్నారు. వచ్చే ఏడాది ఖరీఫ్‌కు సాగునీరు అందించాలనే లక్ష్యంతో పురుషోత్తపట్నం పనులు చేపట్టారు. ప్రస్తుతం పురుషోత్తపట్నం నుంచి పోలవరం ఎడమ కాల్వ ముఖద్వారం వరకు పైపులైన్ పనులు జరుగుతున్నాయి.
పంపుహౌస్‌కు సంబంధించి డిజైన్లు రూపకల్పన జరుగుతోంది. కాంట్రాక్టు సంస్థ ఆరు చోట్ల ఫ్యాబ్రికేషన్ ప్లాంట్లను ఏర్పాటుచేసింది. అందులో నాలుగు ప్లాంట్లలో పైపులైన్ల తయారీ వేగంగా జరుగుతోంది. పంపుహౌస్‌ల వద్ద పది పంపులు ఏర్పాటు చేసి నీటిని తోడేందుకు ఏర్పాటు చేస్తున్నారు. 3500 క్యూసెక్కుల నీటిని ఐదు పంపుల ద్వారా పది కిలోమీటర్ల దూరంలో వున్న గండికోట సమీపంలోని పోలవరం కాల్వలోకి మళ్ళిస్తారు. పురుషోత్తపట్నం వద్ద రెండు పంపులకు ఒక పైపు ఉండేలా డిజైన్ చేశారు. దీనికోసం మొత్తం 284 ఎకరాల భూములు అవసరమని గుర్తించారు. పురుషోత్తపట్నం నుంచి గండికోట సమీపంలోని పోలవరం వరకు సుమారు పది కిలోమీటర్ల మేర పైపులైన్ నిర్మాణం సాగుతోంది. పోలవరం కాల్వలోని 57 కిలోమీటర్ల వద్ద నీటిని వదులుతారు. అక్కడ నుంచి ఏలేరు వాగులోకి వెయ్య క్యూసెక్కుల నీరు విడిచిపెడతారు. కిర్లంపూడి మండలం బూరుగుపూడి వద్ద పోలవరం కాల్వ మీద మరో పంపు హౌస్ నిర్మిస్తారు. ఇక్కడ నాలుగు పంపులు ఏర్పాటు చేసి 1400 క్యూసెక్కుల నీటిని రెండు పైపుల ద్వారా 12కిలోమీటర్ల దూరంలో ఏలేరు రిజర్వాయర్‌లో కలుపుతారు. అక్కడ నుంచి ఏలేరు ఎడమ కాల్వ ద్వారా విశాఖకు నీరందిస్తారు. ఇక్కడ కూడా మరో 25ఎకరాల భూమి అవసరంగా గుర్తించారు. మొత్తం రూ.1638కోట్ల ప్రస్తుత అంచనా అయినప్పటికీ, ఇది మరింతగా పెరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి.
అయితే పశ్చిమ గోదావరి జిల్లాలో పోలవరం కుడికాల్వ ఆధారంగా నిర్మించిన పట్టిసీమ ఎత్తిపోతల మాదిరిగా నిర్దేశిత గడువులోగా పురుషోత్తపట్నం ఎత్తిపోతల పూర్తయ్యే పరిస్థితి కనిపించడంలేదు. దీనికి కారణం పథకానికి అవసరమైన భూసేకరణ వ్యవహారం ఇంకా తేలలేదు. కొత్త చట్టం ప్రకారం చట్టబద్ధ ప్రక్రియలన్నీ పూర్తిచేసి భూసేకరణ చేయాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో భూసేకరణ ప్రయత్నాలు మళ్ళీ మొదటికొచ్చాయి. ముందు నష్టపరిహారం చెల్లించిన తర్వాతే తమ భూముల్లోకి అడుగు పెట్టాలని, అంతవరకు పనులు చేపట్టేందుకు వీల్లేదని, పైపులైన్ పనులను రైతులు అడ్డుకుంటుండటంతో జల వనరుల శాఖ అధికారులకు ఏమి చేయాలో తెలియని స్థితి నెలకొంది. గ్రామ సభలు ఏర్పాటు చేసి భూ సేకరణ ప్రక్రియను సాధ్యమైనంత వరకు సత్వరం పూర్తిచేస్తే గానీ పనులు సకాలంలో పూర్తయ్యే పరిస్థితి లేదు
ప్రస్తుతం నాగళ్లపల్లి వద్ద పైపులైన్ పనులు జోరుగా సాగుతున్నాయి. వాస్తవానికి ఇంకా ఎక్కడా రైతులు భూములు ఇవ్వలేదు. మరోవైపు పనులను మాత్రం అధికార యంత్రాంగం పరుగు పెట్టిస్తున్నారు. ఇక్కడా రైతులు పైపులైన్ పనులను అడ్డుకుంటున్నారు. దీంతో కొన్ని చోట్ల పైపులైన్ పనులు నిలిచిపోయాయి. నాగళ్లపల్లి పరిధిలో ఇప్పటికే 550 మీటర్ల మేర పైపులైన్ నిర్మించారు. చినకొండేపూడిలో పైపులైన్ నిర్మాణానికి మట్టి తవ్వకం పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏప్రిల్ మొదటి వారంలోనే నష్టపరిహారం విషయంలో రైతులను ఒప్పించి పైపులైన్ పనులు వేగవంతంగా నిర్వహించాలనే నిర్ణయానికి అధికారులు వచ్చారు. ఈలోగా పంపుహౌస్ పనులను మరింత వేగవంతం చేయాలని పనులు కొనసాగిస్తున్నారు.

చిత్రం... పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం