ఆంధ్రప్రదేశ్‌

లీకేజీగా వక్రీకరిస్తున్నారు: మంత్రి గంటా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, మార్చి 30: టెన్త్ ప్రశ్నాపత్రం వాట్సప్ మెసేజ్ ద్వారా బయటకు వచ్చిన వ్యవహారంలో ఇప్పటికే ఓ ఇన్విజిలేటర్‌ను సస్పెండ్ చేశాం..దీనిపై విచారణ జరుగుతోంది.. వాస్తవాలు తేలిన తరువాత బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం..ప్రభుత్వపరంగా లీకేజి జరిగితే రాజీనామాకు తాను సిద్ధమని ఉన్నత విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. టెన్త్ ప్రశ్నాపత్రాల లీకేజి ఆరోపణలపై మంత్రి గురువారం శాసనసభలో వివరణ ఇచ్చారు. ఈ వ్యవహారంపై పూర్తి స్థాయిలో విచారణకు ప్రభుత్వం ఆదేశించిందని తెలిపారు. తమ వద్ద పూర్తి వివరాలు ఉన్నాయని చెప్తున్న జగన్ విచారణకు సహకరించాలన్నారు. ప్రభుత్వపరంగా విచారణ పూర్తయి దోషులపై చర్యలు తీసుకుంటే అదేదో తమ ఘనతగా ప్రతిపక్షనేత జగన్ సమస్యను వక్రీకరిస్తున్నారని విమర్శించారు. అంతేకాదు సాక్షి దినపత్రికలో ఉద్దేశ్యపూర్వకంగా 7500 స్కూళ్లను మూసివేస్తున్నట్లు తప్పుడు కథనాలు ప్రచురించారని దుయ్యబట్టారు. వైఎస్ హయాంలో లీకయితే పరీక్షలను రద్దుచేశారా అని ప్రశ్నించారు.