ఆంధ్రప్రదేశ్‌

పేదల ఆశాజ్యోతి మోదీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 2: పేదల ఆశాజ్యోతిగా ప్రధాని నరేంద్ర మోదీ చరిత్రకెక్కారని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం వెంకయ్యనాయుడు అన్నారు. ఇటీవల ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బిజెపి నాలుగు రాష్ట్రాల్లో గెలిచిన నేపథ్యంలో ఆదివారం ఇక్కడ విజయోత్సవం నిర్వహించారు. ఈసందర్భంగా జరిగిన సభకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపి డాక్టర్ కంభంపాటి హరిబాబు అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ విజయదుందుభి మోగించినందుకు పార్టీ కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. ఈ ఐదు రాష్ట్రాల్లో అత్యధిక అభ్యర్థులు గెలవగా గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో అత్యధిక ఓట్లు సాధించామన్నారు. ఈ ఎన్నికలకు ముందు గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్, చండీగఢ్, బెంగాల్, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, ఒడిశా స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి అత్యధిక స్థానాలు సాధించిన విషయాన్ని గుర్తుచేశారు. త్రిపురలో బిజెపి రెండో స్థానానికి చేరిందన్నారు. ప్రస్తుతం బిజెపికి పార్లమెంట్‌లో 352 మంది సభ్యులున్నారని, 1,385 మంది ఎమ్మెల్యేలున్నారని, ఇవి బిజెపి చరిత్రలో రికార్డుగా చెప్పారు. నేడు 17 రాష్ట్రాల్లో బిజెపి ప్రభుత్వాలు ఉన్నాయన్నారు. దేశ జనాభా 65శాతం వున్న భూభాగంలో బిజెపి అధికారంలో ఉందని చెబుతూ లోక్‌సభలో అత్యధిక ఎస్సీ, ఎస్టీ, ఓబిసి, మహిళా, రైతు ఎంపీలున్నా పార్టీగా బిజెపి బలోపేతం అయిందన్నారు. 11 కోట్ల మందితో ప్రపంచంలోనే అత్యధిక సభ్యులున్న పార్టీ కూడా బిజెపినే అన్నారు. రాబోయే రోజుల్లో దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీ బలపడాలని కార్యకర్తలకు సూచించారు. ‘సంస్కరించు.. ఆచరించు.. మార్చు’ అనేది నేటి అభివృద్ధి మంత్రమన్నారు. ‘అభివృద్ధి-సుపరిపాలన’ అనేది కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా చెప్పారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఇచ్చిన హామీకి బిజెపి కట్టుబడి వుందన్నారు. అధికారంలోకి రాగానే పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి, ప్రాజెక్టు నిర్మాణానికి ఆటంకంగా ఉన్న 7 ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలిపిందని వెంకయ్య నాయుడు వివరించారు. ముందుగా ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ మాట్లాడుతూ తాను ఎన్నికల్లో విజయం సాధించేందుకు కృషిచేసిన కార్యకర్తలు, నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. వేదికపై రాష్ట్ర మంత్రులు డాక్టర్ కామినేని శ్రీనివాసరావు, పైడికొండల మాణిక్యాలరావు, ఎమ్మెల్సీలు సోము వీర్రాజు, కె సత్యనారాయణరాజు, తదితరులు ఆశీనులయ్యారు. సభకు ముందు గన్నవరం నుంచి విజయవాడకు భారీ ర్యాలీతో వెంకయ్య నాయుడును వేదిక వద్దకు తీసుకొచ్చారు.