ఆంధ్రప్రదేశ్‌

హనుమంత వాహనంపై రామయ్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంటిమిట్ట, ఏప్రిల్ 8: కడప జిల్లా ఒంటిమిట్టలో జరుగుతున్న శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం శ్రీకోదండరామునికి హనుమంత వాహనసేవ నిర్వహించారు. ఉదయం ఆలయంలో మూలవరులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి నవనీత కృష్ణుని అలంకారం చేశారు. ప్రత్యేక పూజలు, హారతి అనంతరం స్వామివారిని మాడావీధుల్లో ఊరేగించారు. రాత్రి స్వామివారికి హనుమంత వాహనసేవ నిర్వహించారు. సర్వాంగ సందరంగా అలంకరించిన స్వామివారిని హనుమంత వాహనంపై ఆశీనులను చేయించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ మాడావీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు. పెద్దసంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం స్వామివారికి మోహినీ అలంకార సేవ ఉంటుంది. రాత్రి గరుడ వాహనంపై సీతా సమేతంగా కోదండరామస్వామి భక్తులకు దర్శనమిస్తారు.

చిత్రం..హనుమంత వాహనంపై ఊరేగుతున్న కోదండరాముడు