ఆంధ్రప్రదేశ్‌

బడికి వెళ్లమంటే కిందికి దూకేస్తా...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంత్రాలయం, ఏప్రిల్ 11: బడికి వెళ్లమంటే చిన్న పిల్లలు మారాం చేస్తుంటారు.. కుంటిసాకులు చెప్పి తప్పించుకోవాలని చూస్తుంటారు..దొంగ జ్వరాలు, కడుపునొప్పులు తెచ్చుకుని తల్లిదండ్రులను మాయ చేస్తుంటారు. అయితే ఓ మూడో తరగతి కుర్రాడు ఏకంగా వాటర్ ట్యాంక్ ఎక్కి నానా యాగీ చేశాడు. అమ్మా.. బడికి వెళ్లమని చెబితే కిందికి దూకుతానని బెదిరించాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బాలుడిని కిందికి దింపి తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ సంఘటన కర్నూలు జిల్లా మంత్రాలయంలో మంగళవారం జరిగింది. మంత్రాలయం పట్టణంలోని రామచంద్రనగర్‌కు చెందిన చాకలి కృష్ణ, సరస్వతి దంపతుల కుమారుడు వీరేష్(8) సుజరుూంద్రనగర్‌లోని ఓ ప్రైవేటు పాఠశాలలో మూడవ తరగతి చదువుతున్నాడు. గత రెండు రోజులుగా బడికి వెల్లనని మారం చేయడంతో తండ్రి కృష్ణ మందలించాడు. దీంతో మంగళవారం ఉదయం ఇంటి దగ్గర ఉన్న వాటర్ ట్యాంక్ పైకి చేరుకున్న వీరేష్ నానా హంగామా చేశాడు. ఇంతలో తల్లిదండ్రులు, చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకుని కిందికి దిగిరావాలని వీరేష్‌కు నచ్చజెప్పారు. అమ్మా.. బడికి వెళ్లమని చెబితే కిందికి దూకుతానంటూ వీరేష్ బెదిరించాడు. సమాచారం అందుకున్న సిఐ నాగేశ్వరరావు సిబ్బందితో కలిసి హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాలుడ్ని బుజ్జగించి క్షేమంగాకిందికి దింపారు.

చిత్రం..వాటర్ ట్యాంక్‌పైకి ఎక్కిన విద్యార్థి వీరేష్.(కిందికి దిగి వస్తున్న దృశ్యం)