ఆంధ్రప్రదేశ్‌

కోట్లు కూడబెట్టిన మెరైన్ సిఐ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం: చేసేది పోలీసు వృత్తి.. అవినీతి ఆయన ప్రవృత్తి. అక్రమంగా కోట్ల రూపాయలు సంపాదించిన సిఐ ఆస్తుల బండారం బయటపడింది. తనకున్న పలుకుబడితో సర్వీస్‌లో అధిక భాగాన్ని విశాఖ నగరం, చుట్టుపక్కల ప్రాంతాల్లోనే సాగేలా సదరు సిఐ జాగ్రత్తపడ్డాడు. విశాఖ నగరంలో బాగా సెటిల్‌మెంట్‌లు జరిగే పోలీస్ స్టేషన్లంటిలోనూ పనిచేసి, ప్రస్తుతం పూడిమడకలో మెరైన్ సిఐగా పనిచేస్తున్న హుస్సేన్ ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టాడన్న ఆరోపణలతో ఏసిబి అధికారులు బుధవారం హుస్సేన్, ఆయన బంధువుల ఇళ్ళపై ఏక కాలంలో 12 బృందాలు 16 చోట్ల దాడులు జరపగా కోట్ల రూపాయల విలువైన అక్రమాస్తులు బయటపడ్డాయి. నగరంలో పేరుమోసిన బిల్డర్లను చేరదీసి హుస్సేన్ రియల్ ఎస్టేట్ వ్యాపారం సాగిస్తున్నట్టు ఏసిబి డిఎస్పీ రామకృష్ణ ప్రసాద్ తెలిపారు. పెందుర్తి సూర్యానగర్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారం సాగిస్తూ, ఇక్కడ రెండు డ్యూప్లెక్స్ భవనాలు నిర్మించి విక్రయించాడు. మరో రెండు డ్యూప్లెక్స్ హౌస్‌లు నిర్మాణ దశలో ఉన్నాయి. మరో రెండు డ్యూపెక్స్ భవనాలు నిర్మించడానికి ఒప్పందాలు కుదుర్చుకున్నాడు. ఆర్బ్‌రైజ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో హుస్సేన్‌కు ఒప్పందాలు ఉన్నట్టు ఏసిబి అధికారులు గుర్తించారు. ఇక హుస్సేన్ స్నేహితురాలైన అనిత పేరిట పెందుర్తి ముస్లిం కాలనీలో 269 చ.గజాల స్థలం ఉంది. ఈమె పేరిట ఆంథోనీ నగర్‌లో ఒక ఇల్లు ఉంది. ఏసిబి అధికారులు ఈ ఇంటిని సోదాలో డాక్యుమెంట్లు బయటపడ్డాయి. అలాగే విశాలాక్షినగర్‌లో ఉంటున్న అనిత అక్క పేరిట కూడా కొన్ని ఆస్తులు ఉన్నట్టు ఏసిబి అధికారులు గుర్తించారు. పూడిమడక వద్ద హుస్సేన్ ఒక అత్యాధునిక విల్లాను నిర్మించుకున్నాడు. మత్స్యకారుల పేరిట ఉన్న ఇంటిని తీసుకుని, దాన్ని స్విమ్మింగ్‌పూల్‌తో కూడిన విలాసవంతమైన భవనంగా మార్చుకున్నాడు. హుస్సేన్ కుమార్తెను హెచ్‌పిసిఎల్ ఉద్యోగికి ఇచ్చి వివాహం చేశాడు. ఆమె బెంగళూరులో ఉంటోంది. ఆమె పేరిట ఉన్న లాకర్ తెరిచి చూడగా, 400 గ్రాముల బంగారు ఆభరణాలు లభించినట్టు చెప్పారు. విశాఖపట్నంలో తొమ్మిది చోట్ల, బెంగళూరులో ఒక చోట, విజయనగరం జిల్లాలో రెండు చోట్ల, శ్రీకాకుళం జిల్లాలో రెండు చోట్ల, రాజమండ్రిలో రెండు చోట్ల ఏసిబి అధికారులు దాడులు నిర్వహించారు.

రోడ్డు ప్రమాదాల్లో
ఐదుగురు దుర్మరణం
ఓజిలి/తాడిపత్రి, ఫిబ్రవరి 17: రాష్ట్రంలో జరిగిన రెండు రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు మృతి చెందారు.నెల్లూరు జిల్లా ఓజిలి సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. కురుగొండ గ్రామానికి చెందిన ఇద్దరు ద్విచక్రవాహనంపై వస్తుండగా పెదపరియ క్రాస్‌రోడ్డు సమీపంలో చెన్నై నుండి నెల్లూరు వైపు వెళుతున్న కారు అతివేగంగా ఢీకొంది. ఈ సంఘటనలో స్కూటర్‌పై ప్రయాణిస్తున్న ప్రసాద్ (50) ముని చంద్రారెడ్డి (48)లకు తీవ్ర గాయాలయ్యాయి. హైవే మొబైల్ సిబ్బంది గాయపడిన వారిని చికిత్స నిమిత్తం గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ వారిద్దరు మృతి చెందారు. అలాగే అనంతపురం జిల్లా తాడిపత్రి శివారులో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. లారీ, ట్రాక్స్‌క్లూజర్ ఢీకొనడంతో గెర్డావ్ స్టీల్ పరిశ్రమకు చెందిన ట్రాక్స్‌క్లూజర్ డ్రైవర్ హజీవలి(40), విద్యార్థులు నిశాంత్(6), సాత్విక్(6) అక్కడిక్కడే మృతిచెందారు. గణేష్, హర్షిదాకు తీవ్రగాయాలయ్యాయి. ట్రాక్స్‌లో పాఠశాలకు వెళ్లిన పిల్లలు తిరిగి ఇంటికి వస్తుండగా లారీ ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
అంచనాలు పెంచేసి దోపిడీ
పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి
మడకశిర, ఫిబ్రవరి 17: రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల అంచనా వ్యయాన్ని రూ.6 వేల కోట్లు పెంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నతస్థాయిలో ప్రజాధనాన్ని దోచుకోవడానికి ప్రయత్నిస్తున్నారని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎన్.రఘువీరారెడ్డి ఆరోపించారు. బుధవారం అనంతపురం జిల్లా మడకశిరలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో టిడిపి అధికారం చేపట్టిన తర్వాత అవినీతికి అంతులేకుండా పోయిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నతస్థాయిలో దోపిడీ చేస్తుండగా, మంత్రులు, ఎమ్మెల్యేలు రీటైల్ దోపిడీ చేస్తున్నారని విమర్శించారు. సాగునీటి ప్రాజెక్టుల అంచనా వ్యయాన్ని వాటిని పూర్తి చేయడానికి పెంచలేదన్నారు. ఎన్టీఆర్ భరోసా ఇళ్ల మంజూరు భాద్యతలు టిడిపి కార్యకర్తలకే కేటాయిస్తామని ఓ మంత్రి పేర్కొనడం సిగ్గుచేటన్నారు. టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హులకు సంక్షేమ పథకాలు ఏమాత్రం అందడం లేదని రఘువీరా ఆందోళన వ్యక్తం చేశారు. సామాన్య ప్రజల పట్ల ఏమాత్రం శ్రద్ధ చూపకుండా కార్పొరేట్ వ్యక్తులకు వత్తాసు పలికే విధంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.

నడిరోడ్డుపై దారుణ హత్య
గుంటూరు జిల్లాలో యువకుడిని తెగనరికిన దుండగులు
అచ్చంపేట, ఫిబ్రవరి 17: గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం వేల్పూరు- రోకలిగుంటవారిపాలెం అడ్డరోడ్డు వద్ద గుర్తుతెలియని సుమారు 30 సంవత్సరాల వయసున్న యువకుడిని గుర్తుతెలియని దుండగులు అతి కిరాతకంగా నరికి చంపారు. సత్తెనపల్లి- అచ్చంపేటలను కలిపే మెయిన్‌రోడ్డు నిత్యం వందలాది వాహనాలతో రద్దీగా ఉంటుంది. బుధవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో గుర్తుతెలియని మృతదేహం రోడ్డుపై ఉందన్న సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. యువకుడిని కొడవళ్లు, గొడ్డళ్లతో అతిదారుణంగా నరికారు. ఇంకా తమ కసి చల్లారని దుండగులు తలను శరీరం నుండి వేరుచేసి పక్కనే పడేశారు. మృతదేహానికి కొద్దిదూరంలో ఆటో బోల్తాపడి ఉంది.
ఆటోకి మూడు నెంబర్లు ఉండటంతో గుర్తు తెలియరాలేదు. ఇంజన్, ఛాసిస్ నెంబర్లను పోలీసులు గుర్తించి సమాచారం సేకరిస్తున్నారు. అయితే మృతదేహం పడి ఉన్న తీరును చూస్తే యువకుడ్ని వేరే ప్రాంతంలో నరికి చంపి నడిరోడ్డుపై పడవేసినట్లుగా అనుమానిస్తున్నారు. తారురోడ్డుపై ఉన్న మృతదేహం వద్ద ఎక్కువ రక్తంగానీ, గాయాలకు యువకుడు పెనుగులాడిన ఆనవాళ్లు గానీ లేకపోవడం ఇందుకు బలం చేకూర్చింది. యువకుడు చిలకపచ్చరంగు, బ్లూ చారల చొక్కా, ఇటుకరాయి రంగు ప్యాంటు ధరించివున్నాడు. క్లూస్‌టీం, డాగ్‌స్క్వాడ్ చేరుకుని ఆధారాలను సేకరించాయి. సిఐ కోటేశ్వరరావు, అచ్చంపేట ఎస్‌ఐ రాజేశ్వరరావు సంఘటన జరిగిన తీరును పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని సత్తెనపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.