ఆంధ్రప్రదేశ్‌

బాబుపై జగన్ విమర్శలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 14: అడ్డగోలుగా జరిగిన రాష్ట్ర విభజన తరువాత కట్టుబట్టలతో రోడ్డునపడ్డ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ కేంద్రం నుంచి ఎక్కువ నిధులు తీసుకొచ్చి ప్రజాసంక్షేమమే ధ్యేయంగా పాటుపడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబును విమర్శించే అర్హత ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి లేదని నరసరావుపేట ఎంపి రాయపాటి సాంబశివరావు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విభజన చట్టంలో రాష్ట్రానికి చేర్చిన 13 కేంద్ర విద్యాసంస్థలతో పాటు చట్టంలో లేకపోయినప్పటికీ అనంతపురంలో నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, విశాఖపట్నంలో మెడికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పార్క్, నెల్లూరులో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ (ఎన్‌ఐఓటి), తిరుపతిలో కులినరీ ఇన్‌స్టిట్యూట్, కాకినాడలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ అండ్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్, అమరావతిలో వాటర్ యూనివర్శిటీ వంటి అనేక ప్రాజెక్టులను ఇప్పటికే తెచ్చిన ప్రభుత్వం తమదన్నారు. పోలవరానికి జాతీయ హోదాతో పాటు 100 శాతం నిధులను కేంద్రం భరించేలా ఒప్పించి అవసరమైన మేరకు నాబార్డు నిధులను తీసుకొచ్చామన్నారు. జగన్ తండ్రి దివంగత రాజశేఖరరెడ్డి హయాంలో ఢిల్లీ నుండి పెట్టుబడిదారులకు, కంపెనీలకు రాయితీలు, పన్ను మినహాయింపులు తీసుకురాగా, తమ నాయకుడు చంద్రబాబు హయాంలో రాజధాని రైతులకు పన్ను మినహాయింపు ఇచ్చేలా కృషి చేస్తున్న ప్రభుత్వం తమదన్నారు. ‘అసలు తోలుమందంగాళ్లు మీ తండ్రి, మీరే’ అని ఆయన విమర్శించారు. అందుకే గతంలో రాజశేఖరరెడ్డి రాష్ట్రానికి సంబంధించి కనీసం ఒక్క ప్రాజెక్టు విషయంలోనూ కేంద్రాన్ని ఒప్పించలేక పోయారన్నారు. వైఎస్ కంటే జగన్‌కు తోలుమందం ఎక్కువగా ఉన్నందున ఆయన పార్టీలోని 21 మంది ఎమ్మెల్యేలు తమ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి టిడిపిలో చేరారని అన్నారు. ‘ప్రతిపక్ష నాయకుడిగా చేతనైతే రాష్ట్భ్రావృద్ధికి తగిన సూచనలు చేయి. చేతకాకపోతే వౌనంగా ఉండు’ అని సూచించారు. ఇప్పటికే ప్రతిపక్ష నాయకుడిగా జగన్ ఉండటం దౌర్భాగ్యమని రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారని ఎంపీ రాయపాటి ధ్వజమెత్తారు.