ఆంధ్రప్రదేశ్‌

నాటకరంగ దినోత్సవంగా కందుకూరి జయంతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఏప్రిల్ 16: రాష్ట్ర ప్రభుత్వం నవయుగ వైతాళికుడు, సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం జయంతిని ప్రభుత్వ అధికారిక పండుగగా నిర్వాహించేందుకు ప్రకటించింది. ఈ మేరకు కందుకూరి జయంతి రోజును నాటకరంగ దినోత్సవంగా వెల్లడించింది. నాటక రంగానికి విశేష కృషిచేసిన కందుకూరి జయంతిని పురస్కరించుకుని ప్రతీ ఏటా కందుకూరి నాటక రంగ పురస్కారాలను ఇవ్వనుంది. కందుకూరి ఈ జయంతి నుంచే ఈ పురష్కరాల ప్రదానం ఆరంభమైంది. తొలిగా రాజమహేంద్రవరం నుంచి శ్రీకారం చుట్టారు. తొలిగా రాజమహేంద్రవరంలో జరిగే కార్యక్రమం ద్వారా ఈ పురస్కారాలను అందిస్తున్నామని నాటక రంగ పురస్కార కమిటీ, రాజమహేంద్రవరం ఎంపి మాగంటి మురళీమోహన్ ఆదివారం రాజమహేంద్రవరంలోని కందుకూరి వీరేశలింగం ఆస్తిక కళాశాలలో జరిగిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. 2017వ సంవత్సరానికిగాను రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో కందుకూరి పురస్కారాలకు ఎంపికైన వారి వివరాలను ఆయన ప్రకటించారు. కర్నాటి లక్ష్మీ నర్శింహయ్య, చింతా కబీర్‌దాస్, అగ్గరపు రజనీభాయి కందుకూరి ప్రతిష్టాత్మక రంగస్థల పురష్కారానికి ఎంపికైనట్టు ఎంపి మాగంటి వెల్లడించారు. వీరి ముగ్గురికి ఒక్కొక్కరికి రూ. లక్ష చొప్పున పారితోషికం, ప్రశంసా పత్రాన్ని అందిస్తారు. ప్రతీ జిల్లాకు ఐదుగురి కళాకారులకు కందుకూరి విశిష్ట పురస్కారాలకు ఎంపిక చేశారు. ఒక్కొక్కరికి రూ.10వేల నగదు పారితోషికం, ప్రశంసా పత్రం అందిస్తారు. 13 జిల్లాల నుంచి 65 మంది కళాకారులు ఈ అవార్డులకు ఎంపికయ్యారు.
శ్రీకాకుళం జిల్లా నుంచి గోకవలస కృష్ణమూర్తి, పి సూర్యనారాయణ, ఎస్ రమణ, వాకమళ్ళ సరోజిని, బస మురళి, విజయనగరం జిల్లా నుంచి ఈపు విజయకుమార్, చిన్న సూర్యకుమారి, తేడా రామదాసు, బివి ఎస్ కృష్ణమోహన్, నాగవోలు పరమేశ్వరరావు, విశాఖపట్నం జిల్లా నుంచి పిఆర్‌జె పంతులు, బివిఎ నాయుడు, వంకాయల సత్యనారాయణ, అనూరాధ, పిళ్ళా సన్యాసిరావు, తూర్పు గోదావరి జిల్లా నుంచి కొండూరి నాగేశ్వరరావు, టికె సూర్యనారాయణ, బాబూరావు (సెట్స్), షేక్ షామిద్ బాబు, పివి కృష్ణారావు, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి బొడ్డేపల్లి అప్పారావు, షేక్ ఖాజావలి, మద్దాలి రామారావు, రాజా తాతయ్య, గండేటి వెంకటేశ్వరరావు, కృష్ణా జిల్లా నుంచి గోవాడ వెంకటరావు, ఆకురాతి భాస్కర చంద్ర, అబ్ధుల్ ఖాదర్ జిలాని, నందగిరి నర్శింహారావు, అమ్మన విజయలక్ష్మి, గుంటూరు జిల్లా నుంచి బి వీరయ్య చౌదరి, ఎం బాలచంద్రరావు, తడికెల ప్రకాష్, ఎన్ రవీంద్ర రెడ్డి, గోపరాజు రమణ, ప్రకాశం జిల్లా నుంచి కె ఆల్‌ఫ్రెడ్, అన్నమనేని ప్రసాద్, పిన్ని వెంకటేశ్వర్లు, రాఘవులు, దొడ్డ మహేంద్ర, నెల్లూరు జిల్లా నుంచి పి భద్రేశ్వరావు, జిబికె మూర్తి, ఎస్ హరనాధ్, తంగెళ్ళపల్లి సుధాకర్, డాక్టర్ జంధ్యాల సుబ్బలక్ష్మి, చిత్తూరు జిల్లా నుంచి రాఘవాచారి, జయప్రకాష్, చింతం దేవనాధం, రాంచంద్రారెడ్డి, కోనేటి సుబ్బరాజు, కర్నూలు జిల్లా నుంచి ఎటూరి దానం, సంగా ఆంజనేయులు, వాల్మీకి రాముడు, చిప్పా సుధాకర్‌బాబు, శ్రీనివాసాచారి, వై ఎస్ ఆర్ కడప జిల్లా నుంచి నాగముని మధుబాబు, వి సుధాకర్, ఎ కృష్ణారావు, నందలూరి బాలాజీ, నవీన, అనంతపురం జిల్లా నుంచి కెసి కృష్ణ, జి నాగభూషణం, చాకల రాముడు, విజయలక్ష్మి, అనురాధ జిల్లా స్థాయి కందుకూరి విశిష్ట పురస్కారాలకు ఎంపికైనట్టు తెలిపారు.
ఈ పురస్కారాలను ఎంపిక చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాటక రంగ ప్రముఖులతో ఎంపిక కమిటీని నియమించింది. ఈ కమిటీకి మాగంటి మురళీమోహన్ అధ్యక్షులుగా ఉన్నారు. సభ్యులుగా మిశ్రో, పాటిబండ్ల ఆనందరావు, పత్తి ఓబులయ్య, బాలచందర్ ఉన్నారు. 30వ తేదీన రాజమహేంద్రవరంలో కందుకూరి ప్రతిష్టాత్మక రంగస్థల పురస్కారాలతో పాటు, జిల్లా స్థాయిలో కందుకూరి విశిష్ట పురస్కారాలు అందిస్తారని ఎంపి మాగంటి తెలియజేశారు. ఇదే వేదికపై 20వ నంది నాటకరంగ 2016 బహుమతి ప్రదానోత్సవం కూడా నిర్వహించేందుకు ముఖ్యమంత్రి అంగీకరించారని తెలిపారు. ఈ సందర్భంగా జరిగే కార్యక్రమానికి అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్, డిప్యూటీ సిఎం చిన రాజప్ప, ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడుతోపాటు పలువురు నాయకులు, ప్రముఖులు, రాష్ట్ర చలనచిత్ర టివి, నాటక రంగ అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ హాజరవుతారని తెలిపారు. సమావేశంలో మేయర్ పంతం రజనీశేషసాయి, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చియ్య చౌదరి, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు తదితరులు హాజరయ్యారు.

చిత్రం..విలేఖరుల సమావేశంలో వివరాలను వెల్లడిస్తున్న ఎంపీ మురళీ మోహన్