ఆంధ్రప్రదేశ్‌

ప్లాస్టిక్ వ్యర్థాలతో రోడ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 20: ప్లాస్టిక్ వ్యర్థాలతో రాహదారుల నిర్మాణం చేపట్టాలని అధికారులను రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి అయ్యన్నపాత్రుడు ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలో ఆయన తన శాఖ అధికారులు, ఇంజనీర్లతో గురువారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే పంచాయితీ రాజ్ శాఖలో 2016-17 సంవత్సరంలో 27 కిలోమీటర్ల మేర ప్లాస్టిక్ రోడ్లు నిర్మించారన్నారు. ఈ తరహా రోడ్ల నిర్మాణంపై అధికారులు దృష్టి సారించాల్సి ఉందన్నారు. రాష్ట్రంలో ఆర్ అండ్ బి రహదారుల నిర్మాణంలో భూసేకరణకు సమస్యలు ఉంటే ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలన్నారు. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 60 శాతం నిర్మాణం పూర్తి అయిన వంతెనలకు ప్రాధాన్యత ఇచ్చి, త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఎపి రోడ్ మెయింటెనెన్సు సిస్టమ్ కింద జిల్లాల్లో ఎ,బి,సి,డి కేటగిరీ కింద గుర్తించిన రోడ్లను మాత్రమే నిర్వహణ చేపడుతామని స్పష్టం చేశారు. చీఫ్ ఇంజనీర్ సాంకేతిక అనుమతి పరిధిని రెండు కోట్ల నుంచి 10 కోట్ల రూపాయలకు పెంచుతున్నట్లు తెలిపారు. టెండర్ పిలిచే సమయాన్ని కూడా తగ్గించాలని సమావేశంలో నిర్ణయించారు. పంచాయితీ రాజ్ నుంచి రహదారులు, భవనాల శాఖకు బదిలీ చేసిన 5500 కిలోమీటర్ల రహదారులను పటిష్టం చేయాలన్నారు. ఆర్ అండ్ బి శాఖ స్థలాలు ఆక్రమణలకు గురి కాకుండా చూడాలన్నారు. జూన్ 15లోగా స్టేట్ హైవేలు, జిల్లా ప్రధాన రహదారులపై ఉన్న పాట్ హోల్స్‌కు మరమ్మతులు చేయాలని, ఇందుకు 2 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఖాళీగా ఉన్న జెఇఇ పోస్టులను అర్హులైన వారితో కన్సాలిడేటెడ్ పేతో సైట్ ఇంజనీర్లుగా నియమించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సుమిత్ర దావ్రా పాల్గొన్నారు.