ఆంధ్రప్రదేశ్‌

బాలుడి గృహనిర్బంధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నంద్యాల, ఏప్రిల్ 20: పదేళ్ల బాలుడిని ఇంట్లో పెట్టి తాళం వేసిన వైనం గురువారం వెలుగుచూసింది. ఐదు రోజుల పాటు ఇంట్లో ఉన్న ఆ బాలుడు జ్వరంతో బాధపడుతూ కేకలు వేయడంతో ఇరుకుపొరుగువారు పోలీసుల సాయంతో తాళం పగులగొట్టి విముక్తి కల్పించారు. కర్నూలు జిల్లా నంద్యాలలో గురువారం జరిగిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. అనంతపురం జిల్లా కదిరికి చెందిన రెహాన్(10) తల్లిదండ్రులు చనిపోవడంతో నంద్యాల పట్టణంలోని సాయిబాబానగర్‌లో ఉన్న తన పినతల్లి సాజిదా, పినతండ్రి సర్దార్ వద్ద ఉంటున్నాడు. సర్దార్ రెహాన్ పట్ల క్రూరంగా ప్రవర్తించేవాడు. గతంలో రెండుసార్లు రెహాన్‌ను ఇంట్లో పెట్టి బయటినుంచి తాళం వేసి వెళ్లాడు. తాజాగా ఐదు రోజుల క్రితం రెహాన్‌ను ఇంట్లో పెట్టి భార్యాభర్తలు ఇద్దరూ కలిసి తాళం వెళ్లి పోయారు. జ్వరం రావడం, ఇంట్లో తినడానికి ఏమీ లేకపోవడంతో గురువారం ఉదయం రెహాన్ తలుపు పైభాగంలో ఉన్న కిటికీ వద్దకు చేరుకుని గట్టిగా కేకలు వేశాడు. ఇది గమనించిన చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు తాళం పగులగొట్టి బాలుడికి విముక్తి కల్పించారు. సర్దార్, సాజిదాను అరెస్టు చేసినట్లు మూడవ పట్టణ సిఐ ఇస్మాయిల్ తెలిపారు. సర్దార్ గతంలో రెండుమూడు సార్లు ఇలాగే చేశాడన్నారు. వీరిద్దరిపై కేసు నమోదుచేసినట్లు ఆయన తెలిపారు.