ఆంధ్రప్రదేశ్‌

పోస్ట్ఫాసుల ద్వారా పాస్‌పోర్టులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఏప్రిల్ 20: విదేశాలకు వెళ్లే డ్రైవర్లకు పాస్‌పోర్టు సదుపాయాన్ని పోస్ట్ఫాసుల ద్వారా కల్పిస్తామని కేంద్ర పెట్రోలియం, సహజవాయువుశాఖామంత్రి ధరేంద్ర ప్రదాన్ అన్నారు. విశాఖ పోర్టు కళావాణి స్టేడియంలో గురువారం చమురు సంస్థలు నిర్వహించిన మెగా డ్రైవర్ల ట్రైనింగ్ వర్క్‌షాపును ఆయన జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసక్తిఉండి విదేశాలకు వెళ్ళాలనుకునే డ్రైవర్లకు కేంద్రం పోస్ట్ఫాసుల ద్వారా పాస్‌పోర్టు సదుపాయాన్ని కల్పించదలిచిందన్నారు. కోటి మంది డ్రైవర్ల వలనే దేశంలో పెట్రోలియం సంస్థలు నడుస్తున్నాయన్నారు. రానున్న కాలంలో కోటి మంది డ్రైవర్లకు ఆధార్, బ్యాంకు ఖాతాలు, కేవలం 12 రూపాయల బీమా ప్రీమియంతో రెండు లక్షల విలువ చేసే హెల్త్‌కార్డులు జారీ చేస్తామన్నారు.
బిపిసి, హెచ్‌పిసిఎల్, ఐఒసి చమురు సంస్థలు డ్రైవర్లకు ప్రతినెలా ఒకసారి హెల్త్ చెకప్ నిర్వహిస్తారన్నారు. స్కిల్ డెవలెప్‌మెంట్ ఇనిస్టిట్యూట్‌ను విశాఖలో ఏర్పాటు చేయనున్నామని, డ్రైవర్లకు నైపుణ్యత పెంపొందించే విధంగా ఇందులో శిక్షణ ఉంటుందన్నారు. డ్రైవర్లు అంతా రెడ్‌సిగ్నల్స్ వద్ద ఇంజన్లు ఆపుచేస్తే రెండు శాతం మేర ఇంధన పొదుపు సాధ్యపడుతుందన్నారు. ఈ విధంగా 15వేల కోట్ల రూపాయల మేర మిగులుతుందన్నారు. అందువల్ల డ్రైవర్లు దీనిపై దృష్టిసారించాల్సి ఉందన్నారు.
ఇందులో భాగంగానే సామాన్యులంతా వారంలో ఒకరోజు ఇంధన పొదుపు పాటించాలంటూ ప్రధాని సందేశంలో పేర్కొన్నారన్నారు. ఈ సందర్భంగా హెచ్‌పిసిఎల్‌లో పనిచేస్తున్న ఉద్యోగుల పిల్లల ప్రతిభను గుర్తించి కేంద్రమంత్రి చేతులమీదుగా గిఫ్ట్‌కార్డులను అందజేశారు. ఇంధన పొదుపులో ఫలితాలు సాధించిన మరికొంతమంది డ్రైవర్లను సత్కరించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రిని విశాఖ ఎంపి డాక్టర్ కంభంపాటి హరిబాబు, అనకాపల్లి ఎంపి శ్రీనివాసరావు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో హెచ్‌పిసిఎల్ చైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్ ముఖేశ్‌కుమార్ సురానా, హెచ్‌పిసిఎల్ అధికారులు, ఎమ్మెల్సీ పివి మాధవ్, ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణమూర్తి, పల్లా శ్రీనివాస్, గణబాబు, పి.విష్ణుకుమార్‌రాజు తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..సదస్సులో మాట్లాడుతున్న కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్